Bheema Teaser
Bheema Teaser: హీరో గోపీచంద్ కి మాస్ హీరోగా మార్కెట్, ఇమేజ్ ఉండేది. యజ్ఞం, రణం, లక్ష్యం చిత్ర విజయాలతో గోపీచంద్ హీరోగా నిలదొక్కుకున్నాడు. అయితే కొన్నేళ్లుగా గోపీచంద్ పరిస్థితి బాగోలేదు. వరుస పరాజయాలతో డీలా పడ్డాడు. గోపీచంద్ క్లీన్ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. ఇటీవల విడుదలైన పక్కా కమర్షియల్, రామబాణం దారుణ పరాజయం చవి చూశాయి.
లాభం లేదని తన మార్క్ ఊరమాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఎంచుకున్నారు. గోపీచంద్ లేటెస్ట్ మూవీ భీమ. ఈ చిత్రంలో గోపీచంద్ లుక్ మాస్ అండ్ ఇంటెన్స్ గా ఉంది. నేడు భీమ టీజర్ విడుదల చేశారు. ఒక నిమిషం నిడివి కలిగిన టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా విజువల్స్ అద్బుతంగా ఉన్నాయి. ఇక ఎద్దుపై కూర్చున్న గోపీచంద్ లుక్ గూస్ బంప్స్ రేపింది.
భీమ మూవీలో గోపీచంద్ పోలీస్ రోల్ చేస్తున్నారు. రూత్ లెస్ పోలీస్ అధికారిగా శత్రువుల దుమ్మురేపుతాడని అర్థం అవుతుంది. భీమ చిత్రంలో గోపీచంద్ కి జంటగా ప్రియా భవాని శంకర్ నటిస్తుంది. మాళవిక శర్మ మరొక హీరోయిన్. నాజర్, నరేష్, పూర్ణ, వెన్నెల కిషోర్, రఘుబాబు ఇతర కీలక రోల్స్ చేస్తున్నారు. టీజర్లో రవి బస్రూర్ బీజీఎం ఆకట్టుకుంది.
భీమ చిత్రానికి హర్ష మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించారు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ లో కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. భీమ మూవీపై టీజర్ అంచనాలు పెంచేసింది. భీమతో గోపీచంద్ హిట్ ట్రాక్ ఎక్కే సూచనలు కనిపిస్తున్నాయి. భీమ గోపీచంద్ కి చివరి ఛాన్స్. ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి. మరి చూడాలి గోపీచంద్ లక్ ఎలా ఉందో…