FIFA World cup 2022 : ఫైనల్ అంటే ఫైనల్.. అలా తలపడ్డారు. మొదటి ఫస్టాఫ్ లో 2 గోల్స్ కొట్టి యమ జోరు మీద ఉంది అర్జెంటీనా.. ఇక ఆ దేశానిదే ప్రపంచకప్ అనుకున్నారు. సెకండాఫ్ చివరి వరకూ అంతే కానీ.. చివరి 8 నిమిషాల్లో ముగుస్తుందనగా ఫ్రాన్స్ గోల్ చేసింది. దీంతో 2-2తో స్కోరు సమయం చేసి షాకిచ్చింది.

ఆ తర్వాత ఎక్స్ ట్రా టైంలోనూ అదే కథ.. ఫ్రాన్స్, అర్జెంటీనా జట్లు కొదమ సింహాల్లో తలపడ్డారు. బాల్ కోసం మైదానంలో యుద్ధమే జరిగింది. కానీ ఫ్రాన్స్ బలమైన రక్షణ వ్యవస్థను దాటేసి మెస్సీ చేసి గోల్ ఈ టోర్నీకే హైలెట్. తన దేశానికి ఈ అద్భుతమైన గోల్ అందించి మెస్సీ ఉత్సాహం నింపారు. తను లెజెండ్ అనిపించుకున్నారు. అయితే తర్వాత ఫ్రాన్స్ సమం చేయడం.. ఎక్స్ ట్రా టైంలోనూ సమంగానే ఉండడంతో పెనాల్టీ షూటౌట్ కు మ్యాచ్ దారితీసింది.
అర్జెంటీనా-ఫ్రాన్స్ ఫైనల్ పోరులో ఇచ్చిన టైంలోగా ఇరుజట్లు సమానంగా పాయింట్లు సాధించాయి. పలుమార్లు ఎక్స్ ట్రా టైం ఇచ్చినా స్కోర్లు సమంగానే ఉండడంతో పెనాల్టీ షూటౌట్ ఇచ్చారు. ఇందులో ఫ్రాన్స్ 2 గోల్స్ మాత్రమే చేయగా.. అర్జెంటీనా షూటౌట్ లో 4 గోల్స్ సాధించి ప్రపంచకప్ విజేతగా నిలిచింది. ఫిఫా వరల్డ్ కప్ ఛాంపియన్ గా నిలిచింది.

ఫైనల్ లో నిజంగానే ఫ్రాన్స్, అర్జెంటీనా పోరు ఉత్కంఠ రేపింది. తొలుత అర్జెంటీనా 2 గోల్స్ చేయగా.. చివర్లో ఫ్రాన్స్ పుంజుకొని షాక్ ఇచ్చింది. ఇక ఫ్రాన్స్ డిఫెడింగ్ ఈ మ్యాచ్ లో బలంగా ఉంది. మెస్సీ సహా అందరినీ గోల్స్ కొట్టేందుకు చాలా ఇబ్బందులు పెట్టింది.
ఇక ఫ్రాన్స్ స్ట్రైకర్ ఎంబపె ఏకంగా ఫైనల్ లో మూడు గోల్స్ కొట్టి తానెంటో నిరూపించుకున్నాడు. మెస్సీ కంటే కూడా ఇతడి గోల్స్ ఖచ్చితత్వంతో సూటిగా ఉండడం విశేషం. మొత్తంగా ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ నిజంగానే రెండు దిగ్గజ జట్లు తలపడితే ఎలా ఉంటుందో అలా జరిగింది. స్కోర్లు సమం అయ్యి పెనాల్టీ షూటౌట్ వరకూ వెళ్లింది. అర్జెంటీనా నలుగురు గోల్స్ సాధించగా.. ఫ్రాన్స్ నుంచి ఇద్దరే గోల్ చేశారు. ఈ పెనాల్టీలో రెండు గోల్స్ ఆపి అర్జెంటీనా గోల్ కీపర్ ఆ దేశాన్ని ఛాంపియన్ గా నిలబెట్టాడు. ఈ క్రెడిట్ మొత్తం అతడిదే. అతడి కలనే కాదు.. దేశం కలను.. మెస్సీ చివరి కోరికను అర్జెంటీనా గోల్ కీపర్ తీర్చాడు.