E-Bike Explosion : పెట్రో వాహనాల వల్ల పర్యావరణం విపరీతంగా దెబ్బతింటోంది. ఆ విషయం ఢిల్లీలోని పరిస్థితి చూస్తే అర్థమైంది. వాయు కాలుష్యంతో దేశ రాజధాని ఢిల్లీలో ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో వాయుకాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. ఏమాత్రం పొల్యూషన్ లేకుండా విద్యుత్ ఆధారంగా నడిచే ఈ వాహనాలు ఇటీవల దేశంలో అందుబాటులో ఉన్నాయి. దేశంలో ఏర్పడిన పొల్యూషన్ ను తగ్గించడానికి ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తోంది. అయితే కొన్ని నెలలుగా ఎలక్ట్రిక్ వాహనాలు ప్రమాదాలకు గురికావడం ఆందోళన కలిగిస్తోంది. తాాజాగా తమిళనాడు రాష్ట్రంలోని ఎలక్ట్రిక్ వాహనం పేలింది. అయితే పెట్రో వాహనాల వల్ల పొల్యూషన్ దెబ్బతింటోంది. కానీ విద్యుత్ వాహనాలతో ప్రాణాలకే ప్రమాదం ఉందని కొందరు విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలు సురక్షితమేనా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై స్పెషల్ ఫోకస్..

తమిళనాడు రాష్ట్రంలోని చిల అల్లపురానికి చెందిన కేబుల్ టీవీ ఆపరేటర్ గా పనిచేస్తున్న దురైవర్మ కొన్ని రోజుల కిందట ఈ బైక్ కొనుగోలు చేశారు. సెప్టెంబర్ 25న రాత్రి బైక్ కు చార్జింగ్ పెట్టి పడుకున్నాడు. ఉదయం 3 గంటలకు ఒక్కసారిగా బైక్ పేలిన శబ్దం వచ్చింది. దీంతో ఈ మంటలు చుట్టుపక్కల వ్యాపించాయి. దీంతో వీరు బాత్రూంలోకి వెళ్లి ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించారు. కానీ విషపూరిత పొగ వ్యాపించడంతో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నిన్న ఇదే రాష్ట్రంలోని వెల్లూరులో ఇదే రకం బైక్ పేలి తండ్రి, కూతుళ్లు మరణించారు. దీంతో ఎలక్ట్రిక్ వాహనాలపై భయం పట్టుకుంది.
సరైన పద్దతిలో మెయింటేన్ చేయకుంటే ఏ వాహనమైనా ప్రమాదమే. అయితే విద్యుత్ వాహనాల విషయంలో కాస్త ఎక్కువే జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. పెట్రో వాహనాలు పేలిన సంఘటనలు లేకపోలేదు. కానీ విద్యుత్ వాహనాల కంటే తక్కువే అనిపిస్తోంది. కానీ పెట్రో వాహనాల వల్ల పర్యావరణం దెబ్బతింటోంది. అయితే కరెంట్ వాహనాలు వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
పర్యావరణహితం కోసం ప్రభుత్వం వీటిని ప్రోత్సహిస్తోంది. అయితే ఈ బైక్ లో ఉండే లిథియం అయాన్ బ్యాటరీలే పేలడానికి కారణం అని తెలుస్తోంది. లిథియం అయాన్ బ్యాటరీతో చాలా ఉపయోగాలు ఉన్నప్పటికీ వీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ఈ బ్యాటరీలను వందల సార్లు చార్జింగ్ పెట్టుకోవచ్చు. వీటి బరువు కూడా తక్కువే. మిగతా బ్యాటరీలతో పోలిస్తే వీటిలో ఉపయోగించే లోహాల ప్రమాదకర స్థాయిలు కూడా చాలా తక్కువే అయితే ఇవి పూర్తిగా సురక్షితమైనవని చెప్పలేమని నిపుణులు తెలుపుతున్నారు.
ఈ బైక్ చార్జింగ్ కోసం పెట్టినప్పుడు బ్యాటరీల్లో రెండు ఎలక్ట్రిక్ టెర్మినళ్లు ఉంటాయి. వీటి మధ్య ఎలక్ట్రోలైట్ ద్రావణం ఉంటుంది. బ్యాటరీని చార్జింగ్ పెట్టినప్పుడు దీనిలో ఆవేశపూర్తి అయాన్లు ఒక ఎలక్ట్రోడ్ నుంచి మరొక ఎలక్ట్రోడ్ కు పయనిస్తుంటాయి. అయితే ఈ ఎలక్ట్రోడ్ ల మధ్య ఉండే ద్రావణం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బ్యాటరీ దెబ్బతిన్నప్పుడు, విపరీతంగా వేడెక్కినప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరిగే ముప్పుంటుంది. అందుకే ఎలక్ట్రోలైట్ ద్రావణం ఉండే బ్యాటరీలను విమానాల్లో కూడా అనుమతించరు.
ఈ బైక్ లనుంచి ఇలాంటి ప్రమాదాలను తప్పించుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వాహనాలు కొనుగోలు చేసేముందు కస్టమర్ మాన్యువల్ పూర్తిగా చదవాలి. బ్యాటరీకి తగిన బ్రాండ్ చార్జన్ నే వాడాలి. తెగిపోయిన వైర్లుండే చార్జర్ పెట్టకపోవడమే మంచిది. ముఖ్యంగా చార్జింగ్ పెట్టేటప్పుడు గోడకు అమర్చి ఉండే ప్లగ్ పాయింట్ ను ఎంచుకోవాలి. బ్యాటరీ నీటిలో మునిగితే , అది దెబ్బతిన్నట్లుగా భావించాలి. అలా నీట మునిగిన బ్యాటరీలను చార్జింగ్ పెట్టకూడదు.
ఇలా జాగ్రత్తలు పాటిస్తే ఎలక్ట్రిక్ బైక్ లు అంత ప్రమాదకరం కావు. వాటి వల్ల ప్రమాదాలు జరగవు. పైగా పర్యావరణ హితం. కాబట్టి ఈబైక్స్ విషయంలో ప్రాథమిక సూత్రాలు పాటిస్తే వాటంత సురక్షితమైనవి మరొకటి ఉండవు..