Allu Arjun- Kalyan Ram: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు గత కొన్నిరోజులుగా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. కార్లకు బ్లాక్ ఫిల్మ్‌లు, టూ వీలర్స్‌కు ప్రెస్, పోలీస్ అంటూ నకిలీ స్టిక్కర్లు అతికిస్తుండటంతో పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు మరింత జోరు పెంచారు. బ్లాక్ ఫిల్మ్‌లు కనిపించిన కార్లను అడ్డుకుని జరిమానాలు విధిస్తున్నారు.

జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోని నీరూస్ చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ హీరో అల్లు అర్జున్ రేంజరోవర్ కారును ఆపారు. మాదాపూర్ నుంచి జూబ్లీహిల్స్ మీదుగా వెళ్తున్న అల్లు అర్జున్ కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో పోలీసుల దానిని తొలగించి మోటార్ వాహనాల చట్టం నిబంధనల ఉల్లంఘన కింద రూ.700 ఛలానా విధించారు.
Also Read: NTR: హిందీ మార్కెట్ కోసం ఎన్టీఆర్ కొత్త ప్లాన్
మరోవైపు అదే మార్గంలో మరో హీరో కళ్యాణ్ రామ్ కారుకు ఉన్న నల్ల తెరలను కూడా ట్రాఫిక్ పోలీసులు తొలగించి జరినామా విధించారు. అలాగే నిబంధనలు పాటించని మరో 80కి పైగా వాహనాలపైనా కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా వారం కిందట తనిఖీల్లో భాగంగా హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు చెందిన కారుకు బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో వాహనాన్ని ఆపి దాన్ని తొలగించి ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేశారు.

కాగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులు వారం రోజులుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 16,937 కేసులు నమోదు చేశారు. నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ కేసులు 9,387, సౌండ్ పొల్యూషన్ చేస్తున్న వాహనాలపై 3,270 కేసులు, బ్లాక్ ఫిల్మ్ అంటించి తిరుగుతున్న వాహనాలపై 4,280 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
[…] Aamir Khan: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కి మిస్టర్ పర్ఫెక్ట్ అని మంచి పేరు ఉంది. పైగా బాలీవుడ్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోల్లో ఆమీర్ ఖాన్ కూడా టాప్ ప్లేస్ లో ఉంటాడు. సహజంగా అమీర్ తన సినిమా కోసం భారీ కసరత్తులు చేస్తాడు. సినిమా కోసం ఎంత కష్టాన్నైనా పడడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ముఖ్యంగా సినిమా క్వాలిటీ విషయంలో అద్భుతమైన పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్. […]