Prabhas : ప్రభాస్ కి మళ్ళీ ఆపరేషన్..? ఆందోళనలో ఫ్యాన్స్!

నిజంగా ప్రభాస్ మరోసారి సర్జరీ చేయించుకోవాల్సి వస్తే ఈ ప్రాజెక్ట్స్ డిస్టర్బ్ అవుతాయి. మరి చూడాలి ఏం జరుగుతుందో..

Written By: S Reddy, Updated On : January 19, 2024 11:40 am
Follow us on

Prabhas : ప్రభాస్ కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆయనకు మోకాలి నొప్పి సమస్య ఉందని సమాచారం. బాహుబలి సిరీస్ కోసం ప్రభాస్ చాలా కష్టపడ్డాడు. హల్క్ బాడీనీ డెవలప్ చేశాడు. బరువు పెరిగాడు. అలాగే కఠినమైన యుద్ధ విద్యల్లో శిక్షణ పొందాడు. ఈ క్రమంలో ఆయనకు గాయాలయ్యాయి. చాలా కాలంగా ప్రభాస్ కి మోకాలి నొప్పి ఉండగా… తాత్కాలిక చికిత్స తీసుకుంటూ వచ్చారు. నొప్పి తీవ్రత అధికం కావడంతో వైద్యులు సర్జరీ సూచించారు.

ప్రభాస్ గత ఏడాది విదేశాలకు వెళ్ళాడు. అక్కడే ఆయన మోకాలికి సర్జరీ జరిగింది. గాయం మానేవరకు నెల రోజులు ప్రభాస్ విదేశాల్లోనే ఉన్నారు. సలార్ చిత్ర విడుదలకు ముందు ఆయన ఇండియా రావడం జరిగింది. సలార్ చిత్ర ప్రమోషన్స్ లో పెద్దగా పాల్గొనలేదు. కనీసం మీడియా ముందుకు కూడా ప్రభాస్ రాలేదు. యూనిట్ తో పాటు రాజమౌళి ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

గాయం కారణంగానే ప్రభాస్ సలార్ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొనలేదనే వాదన వినిపించింది. ప్రస్తుతం ప్రభాస్ కల్కి 2829 AD , రాజా సాబ్ చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటున్నాడని సమాచారం. కాగా ప్రభాస్ మోకాలి గాయం తిరగబెట్టిందనే టాక్ వినిపిస్తుంది. దీంతో మరోసారి ఆయన సర్జరీ చేయించుకోనున్నాడట. విదేశాలకు వెళ్లే ఆలోచనలో ప్రభాస్ ఉన్నాడంటూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది.

దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఈ వార్తలు ఫ్యాన్స్ ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రభాస్ భారీ చిత్రాలు పూర్తి చేయాల్సి ఉంది. కల్కి విడుదల తేదీ కూడా ప్రకటించారు. సమ్మర్ కానుకగా మే 9న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే రాజా సాబ్ షూటింగ్ కంప్లీట్ చేయాలి. నిజంగా ప్రభాస్ మరోసారి సర్జరీ చేయించుకోవాల్సి వస్తే ఈ ప్రాజెక్ట్స్ డిస్టర్బ్ అవుతాయి. మరి చూడాలి ఏం జరుగుతుందో..

Tags