
దేశంలో కోట్ల సంఖ్యలో యూజర్లు ఫేస్ బుక్ ను వినియోగిస్తున్నారనే సంగతి తెలిసిందే. ఫేస్ బుక్ లో ఉన్న ఒక బగ్ వల్ల ఖాతాదారులకు సంబంధించిన ఈ మెయిల్ ఐడీ, పుట్టినరోజు, అడ్రస్ వివరాలు లీక్ అవుతున్నాయి. ఒక సైబర్ రీసెర్చర్ ఫేస్ బుక్ కు సంబంధించి ఈ విషయాన్ని కనుగొన్నారు. ఫేస్ బుక్ క్రియేట్ చేసుకునే సమయంలో ప్రతి ఒక్కరూ ఈ మెయిల్ ఐడీ, పుట్టినరోజు, ఇతర విషయాలను ఎంటర్ చేస్తారనే సంగతి విదితమే.
Also Read: తొమ్మిదేళ్లకే రూ. 220 కోట్లు సంపాదించిన బుడ్డోడు.. ఎలా అంటే..?
అయితే ఆ బగ్ వల్ల ఫేస్ బుక్ అకౌంట్ ఉన్నవాళ్లకు సంబంధించిన సున్నితమైన సమాచారం లీక్ అవుతోంది. సైబర్ మోసాలు చేసేవాళ్లకు ఈ వివరాలు తెలిస్తే అకౌంట్ ను హ్యాక్ చేసే అవకాశంతో పాటు ఫేస్ బుక్ యూజర్లకు ఇతర సమస్యలు సృష్టించే అవకాశాలు సైతం ఉన్నాయి. ఫేస్ బుక్ బిజినెస్ టూల్ వల్ల ఈ విధంగా జరుగుతోందని.. ఫేస్ బుక్ కొన్ని బిజినెస్ అకౌంట్లకు ఈ ఫీచర్ యాక్సెస్ ఇవ్వడం వల్ల ఈ విధంగా జరుగుతోందని సైబర్ నిపుణులు చెబుతున్నారు.
Also Read: ఫ్లిప్ కార్ట్ బంపర్ ఆఫర్.. రూ.25 వేలకే రూ.70 వేల ఫోన్…?
ఫేస్ బుక్ యూజర్ల కోసం ఒక కొత్త ఫీచర్ ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో ఈ బగ్ ను గుర్తించారని.. ఈ బగ్ కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉంటుందని పోఖరెల్ అనే సైబర్ నిపుణుడు చెప్పారు. ఫేస్ బుక్ ప్రతినిధి అక్టోబర్ లో చేసిన పరీక్షల వల్ల ఈ వివరాలు బయటకు వచ్చాయని వినియోగదారులు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని.. ఫేస్ బుక్ అవసరం అనుకుంటే వేగంగా ఈ బగ్ ను ఫిక్స్ చేస్తుందని వెల్లడించారు.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
బగ్ బౌంటీ ప్రోగ్రాం కింద ఫేస్ బుక్ ఈ బగ్ ను కనిపెట్టిన పరిశోధకుడికి బహుమతిని కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ వివరాల వల్ల ఏదైనా సమస్య ఉత్పన్నమైతే ఫేస్ బుక్ వేగంగా స్పందించి ఫిక్స్ చేయనుందని సమాచారం.