Exclusive interview with Telangana CPI Secretary Chada Venkat Reddy: స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో కాంగ్రెస్ తర్వాత కమ్యూనిజం పార్టీలే దేశంలో ప్రముఖ పాత్ర పోషించాయి. ఉద్యమాల నుంచి హక్కుల దాకా అన్నీ సాధించాయి. తెలంగాణ సాయుధ పోరాటాన్ని మొదలుపెట్టింది ఈ కమ్యూనిస్టు పార్టీలే. ఇప్పటికీ బెంగాల్, కేరళ సహా ఈశాన్యరాష్ట్రాలు, పలు రాష్ట్రాల్లో వీటి ఉనికి ఉంది. కానీ మెల్లిమెల్లిగా కనమరుగవుతోంది.

ఇక మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఖమ్మం, నల్గొండ జిల్లాలో గడిచిన పదేళ్ల క్రితం వరకూ వీటి ఉనికి ఉండేది. కానీ మారుతున్న రాజకీయ పరిస్థితులతో ఇఫ్పుడు కమ్యూనిజం కనుమరుగవుతోంది. కమ్యూనిజాన్ని బతికించేందుకు ఎంతో మంది దిగ్గజ నేతలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు..
అందులో ముఖ్యులు సీపీఐ నారాయణ, చాడా వెంకటరెడ్డి, రామకృష్ణ, తమ్మినేని వీరభద్రం లాంటి వారు ఇప్పటికీ అదే కమ్యూనిస్టు భావాలతో ప్రజల్లోకి వెళుతున్నారు. కానీ ప్రజల మనోభీష్టాలను వారు అందుకోవడం లేదు. ఆ దిశగా ముందుకు సాగడం లేదు.
ఈ క్రమంలోనే తెలంగాణ సీపీఐ చీఫ్ చాడా వెంకటరెడ్డి తన భవిష్యత్ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి రాగల సత్తా కమ్యూనిజానికి ఉందా? ఎలా ముందుకెళుతామన్న విషయాలను వివరించారు. ‘సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి’తో ‘ఓకే తెలుగు.కామ్’ నిర్వహించిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూను కింద వీడియోలో చూడొచ్చు.