Pavan Kalyan: పవన్ కళ్యాణ్ జీవితం ఒక తెరిచిన పుస్తకం.. ఆయన జీవితం ప్రజా సేవకే అంకితం.. ప్రజల కోసం.. వారి సమస్యలు ప్రశ్నించడానికి మాత్రమే వచ్చానని సామాన్యుడిలా ప్రజల్లో కలిసిపోతున్నాడు. ‘భీమ్లానాయక్’ సినిమా తీస్తే వచ్చిన లాభాలు రూ.5 కోట్లను కూడా కౌలు రైతుల ఆత్మహత్యలకు ఖర్చు చేసిన మంచి మనిషి మన పవన్ కళ్యాణ్. అంతేకాదు.. వాటిని ఊరూరా తిరిగి పంచుతున్న నిస్వార్థ నాయకుడు మన పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ కళ్యాణ్ చేస్తున్న సేవలను.. రాజకీయంగా దూసుకెళుతున్న తీరును ప్రత్యర్థులు తట్టుకోలేకపోతున్నారు. పవన్ కు వంక పెట్టడానికి ఏమీ లేకపోవడంతో ఆయన వ్యక్తిగత జీవితంపై పడుతున్నారు.

చంద్రుడికి మచ్చలున్నట్టు.. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులున్నాయి. కానీ ఆయన ఆలోచనలు మాత్రం ఎప్పుడూ ప్రజాసేవకు.. అసహాయులను ఆదుకునేందుకే ఆలోచిస్తాయి. బయటకు కనిపించని ఎన్నో సాయాలను పవన్ చేశాడు. చేస్తున్నాడు. రూపాయి సంపాదనలో 80 పైసల వరకూ ఖర్చు చేసేంత దయాగుణం పవన్ సొంతం. అందుకే రాజకీయంగా పవన్ కళ్యాణ్ ను ఎదుర్కోలేక ఇప్పుడు ఆయన వ్యక్తిగత జీవితంపై పడిపోతున్నారు వైసీపీ నయా మంత్రులు.
ఇక పవన్ సామాజికవర్గానికే చెందిన కాపు మంత్రులను వైసీపీ ప్రయోగించి పకాపకా నవ్వుతోంది. వైసీపీ కాపు మంత్రులు ఈసారి మంతి ఎక్కువగా నోరుపారేసుకుంటున్నారు.మంత్రి పదవులు వచ్చాయని రెచ్చిపోతున్నారు. ప్రజా సేవ కోసం మంత్రి పదవులును వినియోగించాల్సిన కొత్త మంత్రులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను తిడితే పాపులర్ అవుతామని నీచానికి దిగుతున్నారు.
కొత్తగా మంత్రి అయిన గుడివాడ అమర్ నాథ్ అయితే తన శాఖ గురించి పూర్తిగా తెలుసుకున్నారో.. వాటి మీద అవగాహన తెచ్చుకున్నారో లేదో కానీ ఏకంగా రోజూ ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ ను తిడుతూ జగన్ వద్ద మార్కులు కొట్టేందుకు చీప్ ట్రిక్స్ చేస్తున్నారని జనసైనికులు ఆరోపిస్తున్నారు. ఆదివారం కూడా ప్రెస్ మీట్ పవన్ పై వ్యక్తిగత విమర్శలకు దిగారు గుడివాడ..పవన్ నాలుగు పెళ్లిళ్లపై నోరుపారేసుకున్నారు.

పవన్ చేస్తున్న మంచి పనులు.. ప్రజాసేవలో తప్పులుంటే తిట్టాలి. కానీ ఆయన వ్యక్తిగత జీవితాన్ని వైసీపీ కాపు మంత్రులు టార్గెట్ చేయడంపై ఆ వర్గంలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
రాజకీయాలను రాజకీయంగా చూసే సంస్కృతి సంప్రదాయాలు ఈ వైసీపీనేతలకు ఎప్పుడో పోయాయి. వారు ఆ పరిధి దాటి విశృంఖలంగా రెచ్చిపోతున్నారు. వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. ఏకంగా పవన్ కుటుంబంపైకి కూడా వెళ్లి నీచాతి నీచంగా వ్యవహరిస్తున్నారు.
గతంలోనూ జగన్ ఓసారి ఇలానే నేరుగా విమర్శించారు. అప్పుడు జనసేనాని పవన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వకుండా ప్రభుత్వ వైఫల్యాలను కడిగిపారేశారు. జగన్ హత్యారాజకీయాలను లేవనెత్తి ప్రశ్నించారు. ఇప్పుడు ‘గుడివాడ’ గుండు పగిలేలా పవన్ కళ్యాణ్ త్వరలోనే సమాధానమిస్తారని జనసైనికులు చెబుతున్నారు. అమర్ నాథ్ లాంటి వాళ్లు మరోసారి ఇలా వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడకుండా గట్టి కౌంటర్లు రెడీ చేసే పనిలో జనసేనాని, సీనియర్ నేతలు ఉన్నారని సమాచారం. అలాంటి వారి నోరు మూతపడేలా సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.