India Vs England 1st Test: తొలి టెస్ట్‌లో 246 పరుగులకు ఇంగ్లండ్‌ ఆలౌట్‌!

లంచ్‌ సమయానికి 108 పరుగలకే 3 వికెట్లు కోల్పియన ఇంగ్లండ్‌ను జోరూట్, బెయిర్‌స్టో ఆదికున్నారు. ఇద్దరూ కలిసి 105 బంతుల్లో 61 పరుగల భాగస్వామ్యంతో జట్టును మళ్లీ నిలిపే ప్రయత్నం చేశారు.

Written By: Raj Shekar, Updated On : January 25, 2024 3:52 pm
Follow us on

India Vs England 1st Test: భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య ౖహె దరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో గురువారం(జనవరి 25న) ప్రారంభమైంది. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. కెప్టెన్‌ అంచనాలకు తగినట్లుగానే ఓపెనర్లు బెన్‌ డకెట్, జాక్‌ క్రాలే ఎప్పటిలాగే దూకుడుగా ఆడారు. సిరాజ్, బూమ్రా బైలింగ్‌లో భారీగా పరుగులు రాబట్టారు. క్రాలే 40 బంతుల్లో 20 పరులుగు చేశాడు. డకెట్‌ 39 బందుత్లో 35 పరుగులు చేశాడు. తర్వాత స్పిన్నర్లు అశ్విన్, జడేజా ఇంగండ్‌ బ్యాట్స్‌మెన్లను కంట్రోల్‌ చేశారు. స్పిన్నర్ల ఎంట్రీతో ఆట భారత్‌ కంట్రోల్‌లోకి వచ్చింది. రవిచంద్రన్ అశ్విన్ 12వ ఓవర్‌లో డకెట్‌ను ఔట్‌ చేశాడు. జడేజా తర్వాత ఓలీ పోప్‌ వికెట్‌ తీశాడు. తర్వాత వచ్చిన జోరూట్‌ వచ్చాడు. రెండో బంతికే ఎల్‌బీడబ్ల్యూ అప్పీల్‌ చేసినా నాటౌట్‌గా ప్రకటించారు. తర్వాత అశ్విన్‌ క్రాలేను అవుట్‌ చేశాడు.

రూట్, బెయిర్‌స్టో కీలక భాగస్వామ్యం
లంచ్‌ సమయానికి 108 పరుగలకే 3 వికెట్లు కోల్పియన ఇంగ్లండ్‌ను జోరూట్, బెయిర్‌స్టో ఆదికున్నారు. ఇద్దరూ కలిసి 105 బంతుల్లో 61 పరుగల భాగస్వామ్యంతో జట్టును మళ్లీ నిలిపే ప్రయత్నం చేశారు. కానీ రెండో సెషన్‌లో బౌలర్లు మళ్లీ విజృంభించారు. అశ్విన్, అక్షర్, బూమ్రా, జడేజా వరుసగా వికెట్లు తీశారు. దీంతో 200 పరుగుల మార్కును కూడా దాటుతుందా అనిపించింది. కానీ బెన్‌ స్టోక్స్‌ బ్యాట్‌ ఝళిపించాడు. వరుసగా వికెట్లు పడుతున్నా.. పరుగులు ఎక్కువ రాబట్టేందుకు స్పిన్నర్లపై విరుచుకుపడ్డాడు. ఎనిమిదో వికెట్‌కు టామ్‌ హార్ట్‌తో కలిసి 38 పరుగుల కీల భాగస్వామ్యం నెలకొల్పాడు. టీ బ్రేక్‌కు ముందు హార్ట్‌ ఔట్‌ అయ్యాడు. దీంతో ఇంగ్లండ్‌ 8 వికెట్లు కోల్పయి 215 పరుగలతో టీ బ్రేక్‌కు వెళ్లింది. ఈ క్రమంలో స్టోక్స్‌ భారీ సిక్స్‌తో హాస్‌ సెంచరీ పూర్తిచేశాడు.

టీ తర్వాత..
ఇక టీ తర్వాత వుడ్‌ తొలి బంతికే ఔట్‌ అయ్యాడు. పదో నంబర్‌ ఆటగాడు జాక్‌ లీచ్‌ కాసేపు స్టోక్స్‌కు అండగా నిలిచాడు. దీంతో స్టోక్స్‌ మళ్లీ బ్యాట్‌కు పనిచెప్పాడు. చివరి వికెట్‌గా స్టోక్స్‌ ఔట్‌ అయ్యాడు. 88 బంతుల్లో 70 పరుగులు చేసి ఔట్‌ అయ్యాడు దీంతో ఇంగ్లండ్‌ ఇన్నింగ్‌ ముగిసింది. 64.3 ఓవర్లలో 246కు ఇంగ్లండ్‌ ఆల్‌ ఔట్‌ అయింది.

వికెట్లు ఇలా..
ఇక భారత బౌలర్లలో బూమ్రా 2 వికెట్లు, అశ్విన్, జడేజా తలా మూడు వికెట్లు, అక్షర్‌ పటేల్‌ 2 వికెట్లు తీశారు. సిరాజ్‌కు వికుట్లు దక్కలేదు. ఇక ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో బెన్‌ స్టోక్స్‌ 70 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఒక ఛాన్స్‌ దక్కడంతో చెలరేగిని స్టోక్స్‌ ఇంగ్లండ్‌ గౌరవప్రదమైన స్కోర్‌ చేయడంలో కీలకంగా మారాడు. లేకుంటే 200 లోపే ఇంగ్లండ్‌ ఆల్ఔట్‌ అయ్యేది.