Economic Survey: కరోనా కల్లోలంలో మందగించిన ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ మేరకు తాజాగా బడ్జెట్ కసరత్తులు ప్రారంభించారు. జీడీపీ అంచనాలు, బడ్జెట్ లో తీసుకోవాల్సిన నిర్ణయాలు, విశ్లేషణలతో కూడిన ఆర్థిక సర్వే పార్లమెంట్ ముందుకు వచ్చింది..

ఆర్థిక సర్వేతో పాటు, వివిధ విభాగాలు ప్రస్తుత ఆర్థిక వ్యవస్థపై ఇచ్చిన గణాంకాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు. 2022 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరానికి ముందు దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన వివరాలను ఆర్థిక సర్వే అందించింది. ఈ సర్వే ప్రకారం జీడీపీ అంచనాలు రూపొందించారు.
2021-22లో జీడీపీ వృద్ధిరేటు 9.2 శాతం నమోదవుతుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. అలాగే 2022-23 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 8-8.5 శాతం ఉంటుందని లెక్కగట్టింది. ఇక 2020-21లో జీడీపీ 7.3శాతం క్షీణించినట్లు స్పష్టం చేసింది.
2021-22లో ప్రభుత్వ మొత్తం వ్యయం 7.0 శాతం పెరిగినట్లు అంచనావేసింది. 2021-22లో వ్యవసాయం, అనుబంధ రంగాలు 3.9 శాతం వృద్ధి చెందుతాయని అంచనా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సేవల రంగం 8.2 శాతం వృద్ధి సాధిస్తుందని అంచనాలున్నాయి.
ప్రపంచంలో ప్రస్తుతం ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్ ది. దాదాపు 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉంది. ప్రపంచంలో తొలి పది స్థానాల్లో నిలిచింది. దాదాపు 130 కోట్ల మంది జనాభాకు ఇదే దిశానిర్ధేశం. 162 సంవత్సరాలుగా బ్రిటీష్ హయాం నుంచి ఈ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. తాజాగా కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ వరుసగా నాలుగో బడ్జెట్ ను రేపు పార్లమెంట్ లో ప్రవేశపెడుతున్నారు.
[…] Financial survey: పార్లమెంటు సమావేశాల్లో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఎకనమిక్ సర్వే 2021-22 సమర్పించారు. ఈ ఆర్థిక సర్వేలో చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సర్వే ప్రకారం అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌లో చేరినవారిలో 78 శాతం మంది నెలకు రూ.1,000 పెన్షన్ కోరుకుంటున్నారు. […]
[…] Bollywood Trends: బాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. కత్రినా పెళ్లి విషయంలో సల్మాన్ ఖాన్ కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు అని రూమర్స్ వినిపించాయి. అయితే, తాజాగా కత్రినా పెళ్లి పై సల్మాన్ ఖాన్ స్పందించాడు. ‘కంగ్రాట్స్ కత్రినా.. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలి. మీ వివాహంతో అందరూ సంతోషంగా ఉన్నారు’ అని బిగ్ బాస్-15 ఫైనల్ సందర్భంగా సల్మాన్ అన్నాడు. ఆ మాటకు ‘మీరు సంతోషంగా ఉన్నారా..?’ అని నటి షెహనాజ్ గిల్ అడగ్గా.. ‘సింగిల్ అయినప్పుడే నేను మరింత సంతోషంగా ఉంటా’ అని సల్మాన్ బదులిచ్చాడు. […]