‘RRR’ release date: రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా రానున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదల కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, మార్చి 18, ఏప్రిల్ 28 రెండు తేదీల్లో ఒకదాన్ని ఫిక్స్ చేస్తామని చిత్రబృందం ఇటీవల అధికారికంగా ప్రకటించింది. కానీ, తాజాగా కొత్త రిలీజ్ డేట్ వినిపిస్తోంది. సమ్మర్ బరిలో ఏప్రిల్ 28న తమ సినిమాను విడుదల చేసేందుకు ఆర్ఆర్ఆర్ టీమ్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. త్వరలో దీనిపై అనౌన్స్ మెంట్ కూడా రానుంది.

అప్పటికి థర్డ్ వేవ్ పూర్తిగా తగ్గి, థియేటర్లు కూడా 100% ఆక్యుపెన్సీతో నడుస్తాయని అంచనా ఉంది. అందుకే, ఈ డేట్ దాదాపు ఖాయం చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. ఇక నేషనల్ రేంజ్ లోనే గొప్ప విజువల్ డైరెక్టర్ గా తనకంటూ వందల కోట్ల మార్కెట్ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న రాజమౌళి సినిమా అనగానే అందరూ ఆసక్తి చూపిస్తారు. పైగా.. ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా రాబోతుంది ఈ సినిమా.
Also Read: సమంత చాలా హాట్ గా ఉందట.. దాతృత్వాన్ని చాటుకున్న మెగాస్టార్
అందుకే, ఈ క్రేజీ భారీ మల్టీస్టారర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. మొత్తమ్మీద ‘ఆర్ఆర్ఆర్’ టీం మొత్తానికి కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకోవడానికి సిద్ధం అయింది అన్నమాట. ఒకటి మాత్రం ఫుల్ క్లారిటీ ఉంది. ‘దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితులు చక్కబడి, ఫుల్ కెపాసిటీతో థియేటర్లు అందుబాటులోఉన్నప్పుడే తమ సినిమాను రిలీజ్ చేస్తాం అని రాజమౌళి చాలా క్లారిటీగా చాలాసార్లు చెప్పాడు.
కాబట్టి.. మార్చి లోపు ఆ పరిస్థితి ఉంటే.. మార్చి 18న సినిమాని రిలీజ్ చేస్తారు. ఒకవేళ.. ఏప్రిల్ లోపు ఆ పరిస్థితి ఉంటే.. ఏప్రిల్ 28న సినిమాను రిలీజ్ చేస్తారు. కాబట్టి కరోనా మూడో వేవ్ ను బట్టి ఆర్ఆర్ఆర్ రిలీజ్ ఉంటుంది. అన్నట్టు నేషనల్ రేంజ్ లో కూడా భారీ అంచనాలు ఉన్న నిజమైన మల్టీస్టారర్ కాబట్టి ఈ సినిమాకి పోటీగా ఏ సినిమా రాకపోవచ్చు.

ఇక రిలీజ్ డేట్ ఫిక్స్ అవ్వడంతో నెటిజన్ల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఈ సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కాగా ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి.
పైగా ఇప్పటికే ఈ సినిమా నుండి అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ ఫస్ట్ లుక్ టీజర్, కొమురం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ టీజర్, మరియు ట్రైలర్ అండ్ సాంగ్స్ విడుదలైయి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేశాయి. దాదాపు నాలుగు వందల కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతుంది ఈ ప్యాన్ ఇండియా మూవీ.
[…] Vikram: తమిళ స్టార్ హీరో విక్రమ్ అంటే విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. విక్రమ్ సినిమా వస్తోంది అంటే.. సౌత్ ఇండస్ట్రీ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేది. పైగా విక్రమ్ కి అభిమానులు పీక్స్ లో ఉండేవారు. కానీ ప్రసుతం అందుకు పూర్తి భిన్నంగా ఉంది విక్రమ్ పరిస్థితి. విక్రమ్ హీరోగా నటించిన కొత్త సినిమా ‘మహాన్’. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్ర టీజర్ ను ఈ రోజు రిలీజ్ చేశారు. ఇందులో విక్రమ్ తో పాటు ఆయన కుమారుడు ధ్రువ్ ప్రధాన పాత్రలో నటించాడు. […]