ప్రజలకు మరో షాకింగ్ న్యూస్.. విజృంభిస్తున్న ఎబోలా..?

ప్రపంచ దేశాల్లో కరోనా మహమ్మారి ఉధృతి ఇంకా తగ్గలేదనే సంగతి తెలిసిందే. దేశంలో 10,000 లోపు కరోనా కేసులు 100 లోపు కరోనా మరణాలు నమోదవుతున్నాయి. కరోనా ఉధృతి తగ్గుతున్న వేళ ఎబోలా విజృంభణ మొదలైంది. మన దేశంలో ఎబోలా కేసులు నమోదు కాకపోయినా ఆఫ్రికాలోని పలు దేశాల్లో ఎబోలా కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎబోలా విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆరు దేశాలను అప్రమత్తం చేసింది. Also Read: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి […]

Written By: Kusuma Aggunna, Updated On : February 17, 2021 1:07 pm
Follow us on

ప్రపంచ దేశాల్లో కరోనా మహమ్మారి ఉధృతి ఇంకా తగ్గలేదనే సంగతి తెలిసిందే. దేశంలో 10,000 లోపు కరోనా కేసులు 100 లోపు కరోనా మరణాలు నమోదవుతున్నాయి. కరోనా ఉధృతి తగ్గుతున్న వేళ ఎబోలా విజృంభణ మొదలైంది. మన దేశంలో ఎబోలా కేసులు నమోదు కాకపోయినా ఆఫ్రికాలోని పలు దేశాల్లో ఎబోలా కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎబోలా విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆరు దేశాలను అప్రమత్తం చేసింది.

Also Read: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి షాక్.. 20 రోజులకు పాజిటివ్‌..?

ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు కొన్ని దేశాఉ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నాయి. ఇప్పటివరకు కాంగో, గినియా దేశాలలో ఎబోలా కేసులు నమోదు కాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆ కేసులకు సంబంధించిన మూలాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. రెండు రోజుల క్రితం గినియా దేశం ఆ దేశంలో ఎబోలా కేసులు నమోదైనట్లు ప్రకటన చేసింది. ఇప్పటికే కరోనాతో ఇబ్బంది పడుతున్న ఆఫ్రికాలో ఎబోలా కేసులు నమోదవుతూ ఉండటం గమనార్హం.

Also Read: విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపిన కరోనా.. సర్వేలో సంచలన విషయాలు..?

1976 సంవత్సరంలో తొలిసారి ఎబోలా కేసులను ఆఫ్రికాలో గుర్తించారు. జ్వరం, కండరాల నొప్పి, విరేచనాలు ఎబోలా వ్యాధి లక్షణాలుగా ఉంటాయి. కిడ్నీ, లివర్ పనితీరుపై ఎబోలా వైరస్ యొక్క ప్రభావం పడుతుంది. 90 శాతం మందికి ఎబోలా వైరల్ వల్ల ప్రాణాపాయం సంభవించే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే విజృంభించిన దేశాల నుంచి ఇతర దేశాలకు కూడా ఎబోలా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు కోసం: కరోనా వైరస్

మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ వేగంగా జరుగుతోంది. వ్యాక్సిన్ పంపిణీ త్వరగా పూర్తైతే కరోనా మహమ్మారి కట్టడి సాధ్యమవుతుందని చెప్పవచ్చు. కరోనా వల్ల శరీరం లోపల కూడా రక్తస్రావం జరిగే అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది.