పంచాయతీ పోరులో పరువు నిలిచేనా..?

ఏపీలో పంచాయతీ ఎన్నికల ఊపు నడుస్తోంది. నేడు మూడో విడత పోలింగ్‌ కూడా కొనసాగుతోంది. నిజానికి లోకల్ బాడీ ఎన్నికల మీద ఎప్పుడూ విపక్షాలకు అంతగా నమ్మకాలు ఉండవు. ఎందుకంటే అధికార పక్షమే దాదాపు పైచేయి సాధిస్తూ ఉంటుంది. ఇక చంద్రబాబు కూడా సార్వత్రిక ఎన్నికల గురించే ఇప్పటిదాకా కలవరిస్తూ వచ్చారు. అనూహ్యంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆధ్వర్యంలోనే లోకల్ బాడీస్‌ ఎన్నికలు జరుగుతున్నాయి. మరో టీఎన్ శేషన్ మాదిరిగా నిమ్మగడ్డ ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చర్యలు […]

Written By: Srinivas, Updated On : February 17, 2021 11:55 am
Follow us on


ఏపీలో పంచాయతీ ఎన్నికల ఊపు నడుస్తోంది. నేడు మూడో విడత పోలింగ్‌ కూడా కొనసాగుతోంది. నిజానికి లోకల్ బాడీ ఎన్నికల మీద ఎప్పుడూ విపక్షాలకు అంతగా నమ్మకాలు ఉండవు. ఎందుకంటే అధికార పక్షమే దాదాపు పైచేయి సాధిస్తూ ఉంటుంది. ఇక చంద్రబాబు కూడా సార్వత్రిక ఎన్నికల గురించే ఇప్పటిదాకా కలవరిస్తూ వచ్చారు. అనూహ్యంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆధ్వర్యంలోనే లోకల్ బాడీస్‌ ఎన్నికలు జరుగుతున్నాయి. మరో టీఎన్ శేషన్ మాదిరిగా నిమ్మగడ్డ ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఏపీలో ఒక్క లెక్కన అధికారులను బదిలీ చేస్తున్నారు. ఇంతకంటే పారదర్శకంగా లోకల్ బాడీ ఎన్నికలు ఇంతకు ముందు జరిగి ఉండవు అన్నంతగా నిమ్మగడ్డ హడావుడి ఉంది. మరి తెలుగుదేశం పార్టీకి జనంలో బలం ఉంటే కచ్చితంగా 2013 నాటి స్థానిక ఎన్నికల ఫలితాలు రిపీట్ కావాల్సిందే.

Also Read: ఎన్నికల వేళ.. పార్టీల గోల

2013లో ఉమ్మడి ఏపీకి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా లోకల్ బాడీ ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ ఎక్కడికక్కడ చీలిపోవడంతో ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. నాడు వచ్చిన సీట్లలో అరవై నుంచి డెబ్బై శాతం పైగా టీడీపీయే గెలుచుకుంది. కేవలం ఇరవై నుంచి పాతిక శాతం మాత్రమే వైసీపీకి దక్కాయి. ఇప్పుడు ఎనిమిదేళ్ల తరువాత మళ్లీ టీడీపీకి గోల్డెన్ చాన్స్ వచ్చింది. అధికార పార్టీ ఆగడాలని ఎక్కడికక్కడ అడ్డుకునే నిమ్మగడ్డ ఉండగా తెలుగుదేశం దుమ్ము దులపాల్సిందే అంటున్నారు.

Also Read: పంచాయతీ ఓట్ల కౌంటింగ్‌ వీడియో షూట్

ఏపీలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ వర్సెస్ జగన్ గా ఏడాదిపాటు అతి పెద్ద రగడ జరిగింది. మొత్తానికి రాజ్యాంగబధ్ధమైన తీర్పుతో నిమ్మగడ్డ తాను ఉండగానే ఎన్నికలను జరిపిస్తున్నారు. ఇంతకంటే విశ్వసనీయమైన ఎన్నికలు ఎపుడూ జరగవు. మరి ప్రజల్లో కనుక టీడీపీ పట్ల 2019 నాటి వ్యతిరేకతే ఉంటే కనుక కచ్చితంగా ఓటమి ఖాయం. అలాగే సంక్షేమ పథకాలు బాగా పనిచేస్తే కనుక వైసీపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు. మరి అదే జరిగితే మాత్రం తెలుగుదేశం పతనాన్ని ఎవరూ ఆపలేరు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

ఈ లోకల్‌ బాడీస్‌ ఎన్నికల ప్రభావమే మున్ముందు జరగబోయే ఎన్నికల మీద కూడా పడుతుంది. ఇక ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యాలు అంటూ కూడా టీడీపీ నానా యాగీ చేయడానికి కూడా అసలు వీలు ఉండదు మరి. ఎందుకంటే ఇది నిమ్మగడ్డ సారధ్యంలో ఫ్రీ అండ్ ఫైర్ గా జరుగుతున్న ఎన్నికలు కాబట్టి. మరి ఈ ఎన్నికలతో టీడీపీ పుంజుకుంటుందా.. లేదా బిచానా ఎత్తివేయాల్సి వస్తుందా తెలియకుండా ఉంది.