Eagle Teaser : ఈగల్ టీజర్ : విధ్వంసం నుంచి రవితేజ విశ్వరూపం వరకూ.. అదిరిపోయిన వీడియో

అయితే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఉత్పత్తి ప్రమాణాలు పటిష్టంగా ఉన్నాయి. జనవరి 13న పాన్ ఇండియా విడుదల కానున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

Written By: NARESH, Updated On : November 6, 2023 12:09 pm
Follow us on

Eagle Teaser : కొద్దిరోజులుగా మంచి సినిమా పడక నాలుగు ఫ్లాప్ లు.. రెండు హిట్లతో నెట్టుకొస్తున్న రవితేజకు ఇప్పుడు అసలు సిసలు సినిమా పడింది. అదే ‘ఈగల్’. తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ అదిరిపోయింది.. గూస్ బాంబ్స్ తెప్పిస్తోంది. ముఖ్యంగా స్టోరీ, పిక్చరైజేషన్, యాక్షన్ గూస్ బాంబ్స్ తెప్పించేలా ఉంది.

రవితేజ తన రాబోయే యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’ సినిమాతో వస్తున్నాడు. తన సినిమాను సంక్రాంతి రేసులోకి దించాడు. సినిమా కంటెంట్ బాగుండడంతో పోటీ రసవత్తరంగా మారనుంది. ఈ రోజు విడుదలైన టీజర్ చూస్తుంటే యాక్షన్ పవర్ ప్యాక్డ్ అని అర్థమవుతోంది.

మనిషి, పురాణం, ఊచకోత వంటి అంశాలను హైలెట్ చేస్తూ రవితేజను మునుపెన్నడూ లేని విధంగా పరిచయం చేయడంతో టీజర్ రక్తికట్టింది. నిప్పు, రక్తం, అభిరుచిని టీజర్ లో హైలెట్ చేశారు. అడవి చుట్టూ ఈ కథ సాగింది. అడవిలోని సాధారణ ప్రజలకు ఒక ఆపాద్భాంధవుడిగా.., ప్రభుత్వానికి ఒక మోస్ట్ వాంటెండ్ గా కనిపించాడు. శత్రువులను వేటాడే ఒక హీరోగా నిలబడ్డాడు.. తన ప్రత్యర్థులను ఊచకోత కోయడం టీజర్ లో చూశాం .

రవితేజ రకరకాల లుక్స్‌లో పవర్‌ఫుల్ డైలాగ్స్ చెప్పడం అభిమానులకు ట్రీట్ గా ఉంది.. రవితేజ పాత్రను ఇంత భారీ స్థాయిలో అందించినందుకు క్రెడిట్ రచయిత, దర్శకుడు, కార్తీక్ ఘట్టమనేనికే చెందుతుంది. రవితేజ ఈ సినిమాలో అద్భుతంగా నటించాడు. అంతే బాగా చిత్రీకరించారు. అనుపమ పరమేశ్వరన్, శ్రీనివాస్ అవసరాల, నవదీప్ మరియు మధుబాల పాత్రలు రవితేజ గురించి చర్చలో అతని పాత్రకు తగినంత హైప్ ను ఇచ్చాయి. దావ్‌జాండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నిజంగా ప్రభావవంతంగా ఉంది.

అయితే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఉత్పత్తి ప్రమాణాలు పటిష్టంగా ఉన్నాయి. జనవరి 13న పాన్ ఇండియా విడుదల కానున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు.