పెళ్లి పేరుతో రూ.11 కోట్లు కాజేసిన మహిళ.. ఏం జరిగిందంటే..?

ఈ మధ్య కాలంలో దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో తరహా మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ నగరంలో పెళ్లి పేరుతో మహిళ 11 కోట్ల రూపాయలు కాజేసింది. హైదరాబాద్ నగరంలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. జల్సాలకు అలవాటు పడ్డ ఒక యువతి నకిలీ ఐపీఎస్ అవతారం ఎత్తి ఈ తరహా మోసాలకు పాల్పడటం గమనార్హం. శృతి సిన్హా అనే యువతి వ్యాపారిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి 11 కోట్లు […]

Written By: Kusuma Aggunna, Updated On : February 24, 2021 7:04 pm
Follow us on

ఈ మధ్య కాలంలో దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో తరహా మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ నగరంలో పెళ్లి పేరుతో మహిళ 11 కోట్ల రూపాయలు కాజేసింది. హైదరాబాద్ నగరంలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. జల్సాలకు అలవాటు పడ్డ ఒక యువతి నకిలీ ఐపీఎస్ అవతారం ఎత్తి ఈ తరహా మోసాలకు పాల్పడటం గమనార్హం. శృతి సిన్హా అనే యువతి వ్యాపారిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి 11 కోట్లు కాజేసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే వీరారెడ్డి అనే వ్యాపారికి శృతి సిన్హా తనను తాను ఐపీఎస్ అధికారిగా పరిచయం చేసుకోవడంతో పాటు పెళ్లి చేసుకుంటానని నమ్మించింది. విడతల వారీగా వ్యాపారి నుంచి మహిళ 11 కోట్ల రూపాయలు తీసుకుంది. అయితే వీరారెడ్డి కొన్ని రోజుల తర్వాత అనుమానం కలిగి ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుడి ఫిర్యాదు మేరకు బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసులు శృతి సిన్హాతో పాటు శృతి సిన్హాకు సహకరించిన మరో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. పోలీసులు ఆమె దగ్గర నుంచి ఆరు కోట్ల రూపాయల విలువైన క్రెడిట్, డెబిట్ కార్డులను, లక్షల విలువ చేసే కార్లను, విల్లాను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. పోలీసులు అపరిచితుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. అపరిచితుల మాటలు నమ్మితే మోసపోయే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.

ఆన్ లైన్ స్నేహాలను నమ్మవద్దని.. ఈ మధ్య కాలంలో ఆన్ లైన్ ద్వారా మోసాలు చేసేవారి సంఖ్య పెరుగుతోందని వెల్లడిస్తున్నారు. రోజురోజుకు ఈ తరహా మోసాలు పెరుగుతున్నాయని ప్రజలు మోసాల పట్ల అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.