బాహుబలి సినిమా చూశారా.. అందులో ప్రభాస్ కాలకేయులను చంపడానికి ఒక వినూత్నమైన విధానాన్ని ఎంచుకుంటాడు. ఒకేసారి ఇనుప గుళ్లను కాలకేయుల మీద ప్రయోగిస్తాడు. దానికోసం ఒక యంత్రాన్ని తయారు చేస్తాడు.. ఆ యంత్రం ద్వారా ఇనుప గుళ్లను ఒకేసారి కాలకేయులమీదికి పంపిస్తాడు. దీని ద్వారా సమయం ఆదా అవుతుంది. శత్రువులను చంపడానికి ఆస్కారం ఏర్పడుతుంది. యుద్ధంలో గెలవడానికి అవకాశం ఉంటుంది. సరిగా ఇదే సిద్ధాంతాన్ని నేటి కాలంలో కొన్ని కంపెనీలు అమలు చేస్తున్నాయి. తద్వారా ఆధునిక కాలంలో యుద్ధాలు అనేవి కేవలం యంత్రాలతో మాత్రమే సాగుతాయని ఆయా కంపెనీలు నిరూపిస్తున్నాయి.
ఇటీవల ఇరాన్ అమెరికా, ఇజ్రాయిల్ దేశాలకు సంబంధించిన యుద్ధ విమానాలు, మిస్సైల్స్ మీద దాడి చేసింది. అత్యంత చౌక ధరలో రూపొందించిన డ్రోన్ల ద్వారా వాటిని నేల కూల్చింది. తద్వారా టెక్నాలజీ అనేది ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో ఇరాన్ నిరూపించింది. పరిమిత వనరులతో.. అపరిమితమైన టెక్నాలజీతో డ్రోన్లు రూపొందించవచ్చని.. వాటి ద్వారా యుద్ధం చేస్తే అత్యంత తక్కువ ధరలో శత్రువులకు నష్టం కలిగించవచ్చని నిరూపించింది ఇరాన్..
ఇరాన్ చేసిన ప్రయోగాని కంటే ముందు లియోనిడాస్ అనే హై పవర్ మైక్రోవేవ్ (HPM) డ్రోన్ల తయారీలో.. వాటి ఉపయోగం లో సరికొత్త విధానాన్ని తెరపైకి తీసుకువచ్చింది. ఇది ఆధునిక యుద్ధాన్ని పూర్తిగా మార్చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకేసారి డ్రోన్లను ఉపయోగించడం లేదా నిలిపివేయడం వంటివి ఈ టెక్నాలజీ ద్వారా చేయవచ్చు.. ఈ విధానం ద్వారా 49 డ్రోన్లను.. సంప్రదాయ ఇంటర్ సెప్టర్ ల ద్వారా ఒకే లక్ష్యం మీద నిమగ్నం చేయవచ్చు. లేజర్లకు విరుద్ధంగా.. అన్ని వ్యవస్థలు ఒకేసారి పనిచేస్తాయి.
ఈ వీడియోను మనదేశంలో ప్రఖ్యాత కార్పొరేట్ దిగ్గజం ఆనంద్ మహేంద్ర తన ట్విట్టర్ లో పంచుకున్నారు..”యుద్ధ వ్యూహాలు అంటే టెక్నాలజీని దిగుమతి చేసుకోవడం కాదు. బదులుగా వేగవంతమైన టెక్నాలజీని రూపొందించాలి. డీప్ టెక్ పర్యవరణ వ్యవస్థల మద్దతుతో స్వదేశీ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హెచ్ పీ ఎం, లేజర్ సామర్ధ్యాలను ఉపయోగించి సరికొత్త యంత్రాలను తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఇటీవల జరుగుతున్న యుద్ధాలు వాస్తవ పరిస్థితిని తెలియజేస్తున్నాయి. చివకైన కామీకేజీ డ్రోన్లను నాశనం చేయడానికి ఇంటర్ సెప్టర్ టెక్నాలజీ ఉపయోగించుకోవచ్చు. దానికోసం కొంత ఖర్చు కూడా అవుతుంది. ఇలాంటి టెక్నాలజీని ఉపయోగించుకోవడం ద్వారా దురాక్రమణదారులకు చరమగీతం పాడవచ్చని” ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.