Best Friends in History: స్నేహానికన్న మిన్న.. లోకాన లేదుర కన్నా.. అన్నా పాట ఏ సమయంలో రచించారో కానీ.. అక్షరాలా ఇది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే స్నేహం అనేది మనం ఏర్పాటు చేసుకుని బంధం కాదు.. అనుకోకుండా ఏర్పడే అందమైన రిలేషన్షిప్. ఇది ఎప్పుడూ అప్పుడని కాదు.. ఎప్పుడైనా స్నేహం పుడుతుంది. అలాగే పురాతన కాలంలో కూడా మంచి స్నేహితులు ఉన్నారు. త్రేతాయుగం నుంచి ద్వాపర యుగం వరకు ఎందరో మంచి స్నేహితులుగా మిగిలారు. వీరిలో రాముడు, కృష్ణుడు తోపాటు మరికొందరు నిజమైన స్నేహం చేసి వారితో అందమైన బంధాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఎవరు ఎవరితో ఎలాంటి స్నేహం చేశారు? ఆ వివరాల్లోకి వెళ్తే..
శ్రీరాముడు – సుగ్రీవుడు:
త్రేతా యుగంలో రామాయణ కావ్యం అందంగా ఉంటుంది. ఇందులోని ప్రతి పాత్ర కీలకంగా ఉంటుంది. రాముడు సీత జాడ కోసం వెళ్ళినప్పుడు అతనికి సుగ్రీవుడు పరిచయం అవుతాడు. రామలక్ష్మణులను సుగ్రీవుడికి హనుమంతుడు పరిచయం చేసి.. సుగ్రీవుడి గురించి వారికి చెబుతాడు. సుగ్రీవుడు రాముడికి తన వానర సైన్యాన్ని సహాయంగా పంపితే.. రాముడు అందుకు సహాయంగా సుగ్రీవుడికి తన అన్న వాలి బాధ నుంచి విముక్తిని కలిగిస్తాడు. ఇలా వీరిద్దరూ మంచి స్నేహితులుగా మారుతారు.
కృష్ణుడు-కుచేలుడు:
శ్రీకృష్ణుడు తన చిన్ననాటి స్నేహితుడు కుచేలుడు మధ్య ఎంతో మైత్రి బంధం ఉంటుంది. కుచేలుడు అల్పసంతోషి. ఇతను దారిద్రంతో కొట్టు మిటాడుతాడు. బహుసంధానంతో బాధపడుతూ ఉంటాడు. అయితే ఒకసారి కుచేలుడి భార్య శ్రీకృష్ణుడిని కలవమని కోరుతుంది. దీంతో కుచేలుడు ద్వారక వెళ్ళగానే శ్రీకృష్ణుడు కుచేలుడికి సాగర స్వాగతం పలుకుతాడు. అలాగే తన ఇంట్లో కూర్చోబెట్టి తన స్నేహితుడి కాళ్లు కడుగుతాడు. ఇలా చేయడం ద్వారా వారి మధ్య స్నేహం ఎంత గొప్పదో తెలుస్తుంది.
కృష్ణుడు – అర్జునుడు:
కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి పాత్ర ఏంటో అందరికీ తెలిసిన విషయమే. భగవద్గీత ప్రసాదిస్తూ అర్జునుడికి కృష్ణుడు ఎంతో సాయంగా ఉంటాడు. తనకు మంచి మిత్రుడుగా అర్జునుడిని భావించి సన్మార్గంలో నడిచేలా చేస్తాడు. ధర్మం నిలబట్టేందుకు మంచి మాటలను చెబుతూ ఉంటాడు. దీంతోమంచి స్నేహం అంటే మంచి మాటలు చెప్పేవాడు కూడా అని అర్థం చేసుకోవాలి.
కర్ణుడు-దుర్యోధనుడు:
దుర్యోధనుడు అంటే అందరికీ ఇష్టం లేదు. కానీ అతను ఒక మంచి స్నేహితుడు అన్న విషయం చాలా కొద్దిమందికే తెలుసు. దుర్యోధనుడు తనతో సమానంగా కర్ణుడిని చూసేవాడు. మిగతా వారి కంటే కర్ణుడిపై ఎక్కువగా ప్రేమను చూపేవాడు. కర్ణుడు సైతం చివరి వరకు దుర్యోధనుడి కోసమే పనిచేసినట్లు చరిత్ర తెలుపుతుంది. ఇలా ఒకరిపై ఒకరు నమ్మకం స్నేహంలో మాత్రమే ఉంటుందని ఇది తెలుపుతుంది.
వీరే కాకుండా ఎంతోమంది తమ స్నేహం కోసం ఎన్నో రకాలుగా ఎన్నో ప్రయత్నాలు చేశారు. నిజమైన స్నేహం ఎప్పటికీ విడిపోదు.