Jr NTR: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె మరణంతో నందమూరి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అన్నగారి కుటుంబంలో ఇంతటి తీవ్ర విషాదం చోటు చేసుకోవడంతో అభిమానులు సైతం తల్లడిల్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ టాపిక్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

జూనియర్ ఎన్టీఆర్ నిన్న తన భార్య ప్రణతతో కలిసి ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఎన్టీఆర్ షేర్ చేసిన ఈ ఫొటోలో.. ఒక పచ్చని ప్రదేశంలో తన భార్య ప్రణతకి ఎదురుగా ఎన్టీఆర్ కూర్చున్నాడు. ఎన్టీఆర్ – ప్రణతి ఇద్దరు కాఫీ తాగుతూ సరదాగా కబుర్లు చెబుతూ చాలా హ్యాపీగా కనిపించారు. దాంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. అయితే, ఈ ఫోటో ట్రెండింగ్ అవ్వడం గమనించిన యాంటీ ఫ్యాన్స్ ఇప్పుడు నెగిటివ్ కామెంట్స్ తో విరుచుకుపడుతున్నారు.
‘ఒకపక్క మేనత్త చనిపోతే.. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తన భార్యతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడని, పైగా క్యూట్ పిక్స్ ను షేర్ చేస్తూ లైక్స్ అండ్ షేర్స్ కోసం తాపత్రయ పడుతున్నాడని యాంటీ ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ ని ట్రోల్ చేస్తున్నారు. అయితే, ఈ ట్రోలింగ్ లో అర్ధం లేదు. ఎన్టీఆర్ తన భార్యతో కలిసి ఉన్న ఫోటో పోస్ట్ చేసే సమయానికి ఉమామహేశ్వరి న్యూస్ తారక్ కి అస్సలు తెలియదు. పైగా జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో ఇంగ్లాండ్ టూర్ లో ఉన్నాడు.

ఈ మధ్య స్టార్ హీరోలు తమకు చిన్న గ్యాప్ దొరికినా వెంటనే విదేశాలకి వెళ్తున్నారు. మహేష్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఎక్కువగా ఈ ఫారిన్ ట్రిప్స్ వేస్తూ ఉంటారు. ఇలాంటి ట్రిప్స్ కి ఎన్టీఆర్ కొంచెం దూరంగానే ఉంటాడు. అయితే, కొరటాల శివతో మొదలవ్వాల్సిన సినిమా లేట్ అవ్వడంతో తన ఫ్యామిలీతో కలిసి సడెన్ గా ఎన్టీఆర్ ఇంగ్లాండ్ వెళ్ళాడు. అంతలోనే కంఠమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య సంఘటన చోటు చేసుకుంది.
విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ వెంటనే ఇండియాకి వచ్చేశాడు. నిజానికి జూనియర్ ఎన్టీఆర్ కి కంఠమనేని ఉమామహేశ్వరితో మంచి అనుబంధం ఉంది. ఎన్టీఆర్ పెళ్లిలో ఉమామహేశ్వరి చాలా యాక్టివ్ గా పాల్గొన్నారు. పెళ్ళికొడుకు కి మేనత్త చేయాల్సిన కార్యక్రమాలు అన్నీ ఎన్టీఆర్ కి ఉమామహేశ్వరినే చేశారు. అందుకే తారక్ కి ఆమె అంటే ప్రాణం. ఈ క్రమంలోనే జూ .ఎన్టీఆర్ కూడా ఉమామహేశ్వరి కూతురి వివాహాన్ని దగ్గర ఉండి జరిపించారు. అన్నిటికీ మించి నందమూరి ఫ్యామిలీలో జూనియర్ ఎన్టీఆర్ ను దగ్గరకు తీసుకుంది ఉమామహేశ్వరినే. అలాంటి ఆమె మరణం తారక్ కి తీరని లోటే.