Vajram: నాగార్జున సినిమాలో ఒక క్యారెక్టర్ కోసం 1996 లోనే 30 లక్షలు తీసుకున్న ఆ నటుడు ఎవరో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన ఎస్ వి కృష్ణారెడ్డి డైరెక్షన్ లో నాగార్జున 1996 లో వజ్రం అనే సినిమా చేశాడు.

Written By: Gopi, Updated On : January 5, 2024 8:40 am

Vajram

Follow us on

Vajram: నాగేశ్వరరావు కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున మొదట్లో సక్సెస్ అవ్వడానికి కొంతవరకు సతమతమైనప్పటికీ ఆ తర్వాత శివ, గీతాంజలి లాంటి సినిమాలు ఇచ్చిన సక్సెస్ లతో ఇండస్ట్రీలో స్టార్ హీరో గా నిలదొక్కుకున్నాడు. ఇక ఆ క్రమంలోనే ఆయన చేసిన వరుస సినిమాలు మంచి విజయాలను అందుకుంటూ వచ్చాయి.ఇక ఇదే క్రమం లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన ఎస్ వి కృష్ణారెడ్డి డైరెక్షన్ లో నాగార్జున 1996 లో వజ్రం అనే సినిమా చేశాడు. ఈ సినిమాలో నాగార్జున తండ్రి పాత్ర చాలా కీలకంగా ఉంటుంది.

అయితే ఈ పాత్ర కోసం ఎవరిని తీసుకుందామని డైరెక్టర్ అనుకుంటున్నప్పుడు ఆయన మైండ్ లోకి చాలా మంది నటులు వచ్చారు వాళ్ళందరిని ట్రై చేసి చూసినప్పటికీ ఎవరు కూడా ఆ పాత్ర ని సరిగ్గా చేయలేకపోతున్నారు ఇక దాంతో ఈ పాత్ర కోసం డైరెక్టర్ కె విశ్వనాథ్ గారిని తీసుకుందామని ఎస్ వి కృష్ణారెడ్డి నాగార్జునతో చెప్పి కె విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్లి మాట్లాడితే ఆయన ముందు ఈ సినిమా చేయనని చెప్పాడు. అయినప్పటికీ కృష్ణారెడ్డి అసలు వినకుండా ఈ క్యారెక్టర్ ఆయనతోనే చేయించాలని పట్టుబట్టి మరి అతన్ని ఒప్పించే ప్రయత్నం చేశాడు.

Vajram

ఇక అందులో భాగంగానే అప్పటికే కె విశ్వనాథ్ తన సినిమా బిజీ లో ఉన్నాడు. అందుకే ఆ క్యారెక్టర్ తనకి నచ్చినప్పటికీ తను చేయలేనని చెప్పాడు. ఇక ఎస్ వి కృష్ణారెడ్డి అసలు వినకపోయేసరికి ఈ సినిమా కోసం 30 లక్షలు ఇస్తే చేస్తానని కే విశ్వనాథ్ చెప్పాడు అయితే వాళ్ల భారీ నుంచి తప్పించుకోవడానికి మాత్రమే కే విశ్వనాథ్ అలా చెప్పాడు కానీ ఒక రోజంతా ఆలోచించిన డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి ఈ క్యారెక్టర్ కోసం 30 లక్షలు ఇచ్చిన పర్లేదని నాగార్జునతో చెప్పి ఒప్పించి ప్రొడ్యూసర్ తో అతనికి 30 లక్షలు ఇప్పించి అతన్ని ఈ క్యారెక్టర్ కోసం లాక్ చేశాడు.

మొత్తానికి అడిగిన డబ్బులను సమకూర్చి ఇవ్వడంతో ఇక కె విశ్వనాథ్ తప్పనిసరిగా ఈ పాత్రలో చేయాల్సి వచ్చింది. కానీ అప్పుడు ఆయన తీసుకున్న రెమ్యున్ రేషన్ మాత్రం సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టులలో కూడా అప్పటివరకు ఎవరు తీసుకోలేదు. ఇక దాంతో ఆయనే ఎక్కువగా డబ్బులు తీసుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందాడు. నిజానికి ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంటుంది అయినప్పటికీ సినిమా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు.