Dill Raju : మళ్లీ అదే కథ.. టాలీవుడ్ లో దిల్ రాజుకు ఎదురే లేదా?

దిల్ రాజు తప్పు చేసినా ఒప్పు చేసినా అడిగే నాథుడు లేడు. దిల్ రాజు సహకారం లేకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాను స్వేచ్ఛగా విడుదల చేసుకునే అవకాశం లేదు. వందల థియేటర్స్ ఆయన ఆధీనంలో ఉన్నాయి. ఎగ్జిబిటర్స్ ఆయన చెప్పినట్లు నడుచుకుంటారు

Written By: Shiva, Updated On : July 31, 2023 1:20 pm
Follow us on

Dill Raju : జులై 30న టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు జరిగాయి. అధ్యక్ష పదవి కోసం సి. కళ్యాణ్, దిల్ రాజు పోటీ పడ్డారు. ఈ రెండు ప్యానెల్స్ మధ్య హోరాహోరీ పోరు నడిచింది. సాధారణ ఎన్నికలను తలపించాయి. అధ్యక్ష పదవికి మ్యాజిక్ ఫిగర్ 25 ఓట్లు. 48 ఓట్లు పోల్ కాగా దిల్ రాజుకి 31 ఓట్లు వచ్చాయి. దీంతో సి. కళ్యాణ్ ఓటమిపాలయ్యారు. గట్టి విశ్వాసంతో ఎన్నికల బరిలో దిగిన దిల్ రాజు మొదటిసారి ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ అయ్యారు. దిల్ రాజు గెలుపును ఉద్దేశిస్తూ సి. కళ్యాణ్ కీలక ఆరోపణలు చేశారు.

ఆయన మాట్లాడుతూ.. ప్రొడ్యూసర్స్ సెక్టార్, స్టూడియో సెక్టార్, ఎగ్జిబిటర్స్ సెక్టార్, డిస్ట్రిబ్యూటర్స్ సెక్టార్స్ కి ఎన్నికలు జరిగాయి. ఎగ్జిబిటర్స్ సెక్టార్ కి చెందిన 16 మంది సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో వారు ఎలక్షన్స్ కి దూరంగా ఉన్నారు. ఆదివారం మిగిలిన మూడు సెక్టార్స్ కి ఎన్నికలు జరిగాయి. ఈ మూడు సెక్టార్స్ ఎన్నికలు సజావుగానే జరిగాయి. ఎగ్జిబిటర్స్ మాత్రం అమ్ముడుబోయారు, అని సి కళ్యాణ్ అన్నారు. తన ఓటమికి అదే కారణమన్నట్లు ఆయన మాట్లాడారు.

ఇంకా మాట్లాడుతూ ఎవరు గెలిచినా ఫిల్మ్ ఛాంబర్, చిత్ర పరిశ్రమ అభివృద్దే ముఖ్యం. ఆ విషయంలో నేను దిల్ రాజుకు సహకరిస్తాను. అన్నారు. దిల్ రాజు కొన్నేళ్లుగా శాసిస్తున్న డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ ఏరియాలపై ఆయన మరింత ఆధిపత్యం సాధించాడు. ఈ గెలుపుతో ఆయనకు తిరుగు లేదని నిరూపితమైంది. దశాబ్దాలుగా ఒక వర్గం చిత్ర పరిశ్రమను శాసిస్తుంది. వాళ్ళ అధిపత్యానికి దిల్ రాజు గండి గొట్టానేది ఒప్పుకోవాల్సిన నిజం.

దిల్ రాజు తప్పు చేసినా ఒప్పు చేసినా అడిగే నాథుడు లేడు. దిల్ రాజు సహకారం లేకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాను స్వేచ్ఛగా విడుదల చేసుకునే అవకాశం లేదు. వందల థియేటర్స్ ఆయన ఆధీనంలో ఉన్నాయి. ఎగ్జిబిటర్స్ ఆయన చెప్పినట్లు నడుచుకుంటారు. దిల్ రాజు తమ చిత్రాలకు థియేటర్స్ లేకుండా చేస్తున్నాడని కొన్ని బడా నిర్మాణ సంస్థలు సొంతంగా డిస్ట్రిబ్యూట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మనం కూడా డిస్ట్రిబ్యూషన్ లో ఎదిగి దిల్ రాజుకు చెక్ పెట్టాలని చూస్తున్నారు. అయితే అదంతా ఈజీ కాదు. అప్పుడే అయ్యే పని కాదు.