దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. రోజురోజుకు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది అనవసర ప్రయాణాలను తగ్గించుకోవడంతో పాట్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కు ప్రాధాన్యతనిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ ధరలను తగ్గిస్తే బాగుంటుందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర 100 రూపాయలు దాటడం గమనార్హం.
Also Read: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న పాల ధరలు..?
అయితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో పెట్రోలియం శాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరల గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శీతాకాలం తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. పెట్రోల్ ధరలు పెరగడం గురించి మాట్లాడుతూ అంతర్జాతీయంగా ధరలు పెరగడం వల్లే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయని మంత్రి అన్నారు.
Also Read: రైలు ప్రయాణికులకు శుభవార్త.. ఇకపైటికెట్ బుకింగ్ ఈజీ..?
పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం అంతర్జాతీయ వ్యవహారమని ప్రకటన చేశారు. డిమాండ్ ఎక్కువగా ఉన్న సమయంలో ధరలు అధికంగా ఉంటాయని శీతాకాలంలో డిమాండ్ ఎక్కువగా ఉంటుందని మంత్రి అన్నారు. ఈ సీజన్ పూర్తైతే ధరలు తగ్గుతాయని పేర్కొన్నారు. అయితే వింటర్ సీజన్ పూర్తి కావడానికి కొన్నిరోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో పెట్రోల్ ధరలు నిజంగా తగ్గుతాయో లేదో చూడాల్సి ఉంది.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
మరోవైపు విపక్షాలు రోజురోజుకు పెరుగుతున్న ధరలపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉండటంతో ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రజలు దృష్టి పెడుతున్నారు. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలనే ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.