అచ్చెన్నకు జగన్ ఇలా చెక్ పెడుతున్నాడన్నట్టు?

‘దువ్వాడ’ ఏపీ రాజకీయ రంగంలో ఓ అలుపెరగని బాటసారి.. ప్రతిసారి ఎన్నికల్లో నిలబడ్డా ఆయనకు గెలుపు అనేది అందని ద్రాక్షే. చట్టసభల్లో పాలుపంచుకోవాలన్న ఆయన దశాబ్ధాల కళ ఇక తీరదు అనుకున్న వేళ దువ్వాడకు అదృష్టం తలుపుతట్టింది.శ్రీకాకుళం జిల్లా నుంచి వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్ పేరు ప్రకటించడం వెనుక కారణమేంటన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. దువ్వాడ శ్రీనివాస్.. శ్రీకాకుళం రాజకీయాలతోపాటు ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. వైసీపీ పార్టీలో దూకుడుగా వ్యవహరించే నేతగా గుర్తింపు […]

Written By: NARESH, Updated On : February 26, 2021 5:35 pm
Follow us on

‘దువ్వాడ’ ఏపీ రాజకీయ రంగంలో ఓ అలుపెరగని బాటసారి.. ప్రతిసారి ఎన్నికల్లో నిలబడ్డా ఆయనకు గెలుపు అనేది అందని ద్రాక్షే. చట్టసభల్లో పాలుపంచుకోవాలన్న ఆయన దశాబ్ధాల కళ ఇక తీరదు అనుకున్న వేళ దువ్వాడకు అదృష్టం తలుపుతట్టింది.శ్రీకాకుళం జిల్లా నుంచి వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్ పేరు ప్రకటించడం వెనుక కారణమేంటన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

దువ్వాడ శ్రీనివాస్.. శ్రీకాకుళం రాజకీయాలతోపాటు ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. వైసీపీ పార్టీలో దూకుడుగా వ్యవహరించే నేతగా గుర్తింపు ఉంది. దువ్వాడకు ఇప్పుడు జగన్ ఎమ్మెల్సీ చాన్స్ ఇవ్వడం శ్రీకాకుళం జిల్లాలో చర్చనీయాంశమైంది.

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్టును ఇటీవల ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఈ లిస్టులో శ్రీకాకుళం జిల్లా నుంచి దువ్వాడ శ్రీనివాస్ పేరు ప్రకటించారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ దువ్వాడకు ఇలా అనూహ్యంగా ఎమ్మెల్సీ అవకాశం దక్కడం వెనుక కారణమేంటన్నది టెక్కలి నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది.

శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఇప్పుడు టెక్కలి చుట్టూనే తిరుగుతున్నాయి. తాజాగా దువ్వాడకు ఎమ్మెల్సీ కట్టబెట్టడంతో మరోమారు టెక్కలి పేరు మారుమోగుతోంది. దీనికి కారణం ఉంది.

ఏపీ టీడీపీ అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఏపీ సీఎం జగన్ కంట్లో నలుసుగా మారారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ పై తీవ్ర దాడి చేశాడు. ఇప్పుడు జగన్ సీఎం అయ్యాక ఫస్ట్ టార్గెట్ గా మారి ఓ కుంభకోణంలో జైలు పాలయ్యాడు. దీంతో టెక్కలిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది వైసీపీ ప్రభుత్వం. ఆ క్రమంలోనే టెక్కలిలో 2019 ఎన్నికల్లో అచ్చెన్నాయుడిపై పోరాడి ఓడిన వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ కు జగన్ ఏరికోరి ఎమ్మెల్సీ కట్టబెట్టారు.

వచ్చే ఎన్నికల్లో టెక్కలిలో అచ్చెన్నాయుడు ఓడించాలని పట్టుదలతో ఉన్న జగన్ అక్కడ అచ్చెన్నపై బలంగా పోరాడుతూ టీడీపీని దువ్వాడ శ్రీనివాస్ ఎండగడుతున్నారు. కానీ అధికారం లేకపోవడంతో ఆయనకు సహకారం కరువైంది. అందుకే ఇప్పుడు ఎమ్మెల్సీ చేసి టెక్కలిపై పూర్తి రైట్స్ ఇస్తే అధికార యంత్రాంగం కూడా సహకరించి అచ్చెన్నాయుడు పని పట్టవచ్చనే కారణంతోనే దువ్వాడను ఎమ్మెల్సీ చేయబోతున్నట్టు సమాచారం.