
Dasara Movie First Review : మరో రెండు రోజుల్లో దసరా థియేటర్స్ లో దిగనుంది. సినిమా మీద అంచాలున్నాయి హీరో నాని చాలా కాన్ఫిడెంట్ గా ప్రమోట్ చేస్తున్నారు. నాని కెరీర్లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. ఈ చిత్ర విజయం ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రచారం కల్పిస్తున్నారు. కారణం, దసరా హిట్ అయితే నాని రేంజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళుతుంది. పాన్ ఇండియా హీరో ట్యాగ్, భారీ రెమ్యూనరేషన్, ఇతర పరిశ్రమల్లో మార్కెట్.. ఇలా అనేక ప్రయోజనాలుంటాయి. ఇక కథ, కథనాలతో పాటు తన టాలెంట్ మీద గట్టి విశ్వాసం ప్రదర్శిస్తున్నాడు.
కాగా దసరా మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. చెప్పాలంటే ఆయనకు ఇది గుడ్ న్యూస్. దసరా మూవీ మొట్టమొదటి రివ్యూ పాజిటివ్ గా వచ్చింది. ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు ఫిల్మ్ క్రిటిక్ ఉమర్ సంధు దసరా మూవీపై తన అభిప్రాయం తెలియజేశారు. ఆయన ట్విట్టర్ వేదికగా షార్ట్ రివ్యూ ఇచ్చారు. దసరా పైసా వసూల్ పక్కా కమర్షియల్ మూవీ. హీరో నాని వన్ మ్యాన్ షో చేశాడు. అవార్డు విన్నింగ్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక కీర్తి సురేష్ గురించి చెప్పాలంటే ఆమె బాంబులా పేలారు. యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలెట్. దసరా మూవీకి నా రేటింగ్ 3.5/5 అని ట్వీట్ చేశారు.
ఉమర్ సంధు దసరా చిత్రానికి పూర్తి పాజిటివ్ రేటింగ్ ఇచ్చారు. నాని, కీర్తి సురేష్ యాక్టింగ్, యాక్షన్ సన్నివేశాలు అద్భుతం అన్నారు. కాసులు కురిపించే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అని అంచనా వేశారు. ఉమర్ సంధు రివ్యూ నాని ఫ్యాన్స్ లో జోష్ నింపుతుంది. అయితే ఉమర్ సంధు రేటింగ్ చాలా సార్లు అటు ఇటు అయ్యింది. వాల్తేరు వీరయ్యకు ఆయన నెగిటివ్ రివ్యూ ఇచ్చారు. అది బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. సూపర్ హిట్ రేటింగ్ ఇచ్చిన వీరసింహారెడ్డి జస్ట్ హిట్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది.
డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దసరా చిత్రాన్ని తెరకెక్కించారు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. బలమైన భావోద్వేగాలతో కూడిన విలేజ్ రివేంజ్ డ్రామా అని ప్రచారం జరుగుతుంది. లవ్, ఫ్రెండ్షిప్, రివేంజ్ ఆధారంగా దసరా తెరకెక్కింది అంటున్నారు. భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్న నానికి దసరా ఎలాంటి ఫలితం ఇవ్వనుందో చూడాలి.
First Review #Dasara : A Paisa Vasool Mass Entertainer ! #Nani New Game in Pan India 🇮🇳 & He Stole the Show all the way. Award Worthy Performance by him. #KeerthySuresh looking BOMB 💣 in movie. Action Stunts are First Rate. Go for #Pushpa 2.0 New Version 😀 !
3.5⭐️/5⭐️
— Umair Sandhu (@UmairSandu) March 27, 2023