
Sana romance Alireza : టాలీవుడ్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ లో సనా ఒకరు. దశాబ్దాలుగా పరిశ్రమలో ఉన్నా రావాల్సినంత గుర్తింపు ఆమెకు రాలేదు. సనా 600 వందలకు పైగా చిత్రాల్లో నటించారు. 2020లో ఆహాలో విడుదలైన ‘మెట్రో కథలు’ అనే ఆంథాలజీ సిరీస్లో ఆమె బోల్డ్ రోల్ చేశారు. తాగుబోతు భర్త మీద విరక్తి పుట్టి రోడ్డు మీద వేదనతో నడుచుకుంటూ వెళుతున్న ఆమెను అలీ రెజా ఇంటికి తీసుకెళతాడు. ఆమె తన బాధను పంచుకునే క్రమంలో అలీ రెజాకు దగ్గరవుతుంది. గతంలో సనా అలాంటి బోల్డ్ సీన్లో నటించింది లేదు. తాజా ఇంటర్వ్యూలో ఆ సన్నివేశం మీద ఆమె స్పందించారు.
దర్శకుడు కరుణ కుమార్ కారణంగానే నేను అలీ రెజాతో అలాంటి సన్నివేశంలో నటించాను. తాగుబోతు భర్త కారణంగా అన్నీ కోల్పోయిన భార్యగా ఒక బోల్డ్ సన్నివేశం చేశాను. కరుణ కుమార్ చాలా నీట్ గా తెరకెక్కించారని ఆమె చెప్పుకొచ్చారు. ఈ ఇంటర్వ్యూలో సనా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మొదట్లో ఆమెకు హీరోయిన్ ఆఫర్స్ కూడా వచ్చాయట. హీరోయిన్ ఆఫర్ ఇస్తాం, కాకపోతే మీరు పెళ్ళైన విషయం దాచాలి. బికినీలో స్కిన్ షో చేయాల్సి ఉంటుందని చెప్పారట.
అవి చేయడం ఇష్టం లేక సనా హీరోయిన్ ఆఫర్ వదులుకున్నారట. నటించాలన్న నా అభిరుచిని అత్తమామలు ప్రోత్సహించారని సనా వెల్లడించారు. బయట వాళ్ళు మాత్రం ఆమె గురించి ఆరాలు తీసేవారట. మీ కోడలు బుర్కా వేడుకోదేంటి? ఆమెను ఎక్కడికి తీసుకెళుతున్నారు? అని ప్రశ్నించేవారట. అవన్నీ పట్టించుకోకుండా తనకు ప్రోత్సాహం ఇచ్చారట.
కాగా తన కూతురికి హీరోయిన్ గా ఆఫర్స్ వచ్చాయట. కానీ తనకు నటనంటే ఇష్టం లేదట. మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే అత్తింటివాళ్ళు చిత్ర హింసలు పెట్టారని చెప్పి సనా బాధపడ్డారు. దుబాయ్ లో నా కూతురిని అత్తింటివారు వేధింపులకు గురి చేశారు. తన బంగారం, డబ్బు అంతా వాడేసుకున్నారు. కనీసం తిండి పెట్టకుండా వేధించారు. అయినా ఒక్క మాట కూడా నా కూతురు చెప్పలేదు. అనుమానం వచ్చి ఆరా తీస్తే దారుణాలు బయటపడ్డాయని సనా చెప్పారు. భర్తకు విడాకులిచ్చి కొడుకుతో ఆమె జీవిస్తుందని సనా చెప్పుకొచ్చారు.