https://oktelugu.com/

India Alliance : సనాతన ధర్మ నిర్మూలన, జర్నలిస్టుల టార్గెట్, పాకిస్తాన్ తో సంప్రదింపులు: ఇండీ కూటమి ఎజెండా

కానీ సనాతన ధర్మ నిర్మూలన, జర్నలిస్టుల టార్గెట్, పాకిస్తాన్ తో సంప్రదింపులు: ఇండీ కూటమి ఎజెండాగా పెట్టుకోవడంపై అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : September 15, 2023 / 06:18 PM IST
    Follow us on

    India Alliance : ఇండియా కూటమి ఎజెండా ఏమిటి అన్నది ఇప్పటికీ అంతుబట్టడం లేదు. సనాతనధర్మం నిర్మూలన, జర్నలిస్టుల టార్గెట్, పాకిస్తాన్ తో సంప్రదింపులు.. ఈ మూడు సిద్ధాంతాలతో ముందుకు వెళుతోంది. డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడిన తర్వాత తమిళనాడు నేతలు సపోర్ట్ చేశారు. హిందూధర్మాన్ని నమ్మకుండా విమర్శించిన వారే.. కార్తి చిదంబరం.. ప్రియాంక గార్గే, మౌర్య, సీపీఐ డీ రాజా వంటి వారు అందరూ సనాతన ధర్మ నిర్మూలనకు కంకణం కట్టుకున్నట్టు ప్రవర్తిస్తున్నారు.

    తాజాగా ఇండియా కూటమి కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలోనూ ఈ సనాతన ధర్మం వ్యాఖ్యలపై స్పందించలేదు. చర్చ కూడా లేదు. అంటే దీన్ని సమర్థించినట్టే కదా.. కూటమిగా దీనిపై స్పందించకపోవడం అందరూ అడుగుతున్న ప్రశ్న. ఇంత చర్చ జరుగుతున్నప్పుడు ఒక వింత జరిగింది.

    ఇండియా కూటమి సమావేశమై 14 మంది జర్నలిస్టులను కూటమి బాయ్ కాట్ చేస్తున్నట్టు ప్రకటించారు. నిజానికి కూటములు అన్నాక సీట్ల పంపిణీ, పొత్తులు, సంక్షేమం, అభివృద్ధి ఎజెండాలు ప్రకటిస్తారు. ప్రజలను ఎలా ఆకర్షించాలో వివరించాలి. కానీ సనాతన ధర్మ నిర్మూలన, జర్నలిస్టుల టార్గెట్, పాకిస్తాన్ తో సంప్రదింపులు: ఇండీ కూటమి ఎజెండాగా పెట్టుకోవడంపై అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు.

    దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.