https://oktelugu.com/

Anandam Heroine: ఆనందం హీరోయిన్ ఇలా అయిపోయిందేంటి… గుర్తుపట్టలేనంతగా రేఖ అవతారం!

తారకరత్న డెబ్యూ మూవీ ఒకటో నెంబర్ కుర్రాడు చిత్రంలో రేఖ నటించింది. దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి తెరకెక్కించిన ఒకటో నెంబర్ కుర్రాడు మంచి విజయాన్ని అందుకుంది.

Written By:
  • Shiva
  • , Updated On : September 15, 2023 / 06:16 PM IST
    Follow us on

    Anandam Heroine: రెండు దశాబ్దాల క్రితం చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది రేఖ వేదవ్యాస్. ఈ కన్నడ భామ తెలుగులో కూడా ఫేమ్ తెచ్చుకుంది. తెలుగులో ఆమె మొదటి చిత్రం ఆనందం సూపర్ హిట్. దర్శకుడు శ్రీను వైట్ల కెరీర్ బిగినింగ్ లో చేసిన చిత్రం ఇది. రొమాన్స్, కామెడీ, ఎమోషన్ కలగలిపి పర్ఫెక్ట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందించారు. ఈ చిత్రానికి దేవిశ్రీ అందించిన పాటలు హైలెట్. కామెడీ కూడా ఓరేంజ్ లో ఉంటుంది. ఆనందం హిట్ కావడంతో రేఖకు తెలుగు ఆఫర్స్ క్యూ కట్టాయి.

    తారకరత్న డెబ్యూ మూవీ ఒకటో నెంబర్ కుర్రాడు చిత్రంలో రేఖ నటించింది. దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి తెరకెక్కించిన ఒకటో నెంబర్ కుర్రాడు మంచి విజయాన్ని అందుకుంది. కీరవాణి సాంగ్స్ యూత్ కి తెగ నచ్చేశాయి. నాగార్జున సూపర్ హిట్ మూవీ మన్మధుడు లో గెస్ట్ రోల్ చేసింది. హీరో రోహిత్ కి జంటగా అనగనగా ఓ కుర్రోడు, జానకి వెడ్స్ శ్రీరామ్ చిత్రాల్లో ఆమె నటించారు. అయితే స్టార్స్ పక్కన ఆమెకు ఛాన్స్ రాలేదు.

    తెలుగుతో పాటు కన్నడలో ఎక్కువగా చిత్రాలు చేసింది రేఖ. రేఖ తెలుగులో నటించిన చివరి చిత్రం జీనియస్. 2012లో జీనియస్ విడుదల కాగా ఆమె గెస్ట్ రోల్ చేశారు. ఇక 2014 తర్వాత సిల్వర్ స్క్రీన్ కి పూర్తిగా దూరమయ్యారు. పదం పెసుమ్ అనే తమిళ చిత్రంలో చివరిగా నటించారు. చాలా గ్యాప్ అనంతరం రేఖ తెలుగు ప్రేక్షకులను పలకరించారు.

    ఆమె ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేణు తొట్టెంపూడి, రేఖ పాల్గొన్న ఈ షోకి ఇంద్రజ హోస్ట్ గా ఉన్నారు. సదరు షోలో రేఖను చూసిన జనాలు షాక్ అయ్యారు. కేవలం 38 ఏళ్ల రేఖ గుర్తు పట్టలేనంతగా తయారయ్యారు. ఆమెలో ఒకప్పటి గ్లామర్ లేదు. ముఖం చిక్కిపోయి ఉంది. రేఖకు ఏమైంది? అందుకు ఇలా మారిపోయారు? ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఆమె రూపం ఇలా మారడానికి అనారోగ్య సమస్యలే కారణం అంటున్నారు.