సాధారణంగా స్త్రీలు ధరించే నగలలో ఏడు వారాల నగలు ఎంతో ప్రాముఖ్యత కలిగినవి. ఏడువారాల నగలకు ప్రాముఖ్యత నిచ్చి ఏరోజు ధరించాల్సిన నగలను ఆరోజు ధరించేవారు.వారంలో ఒక్కో రోజు ఒక్కోరకమైన నగలు ధరించడం వల్ల ఈ నగలను ఏడువారాల నగలు అని పిలిచేవారు.అయితే ఈ ఏడు వారాల నగలు ఏ రోజు ఎలాంటి నగలను ధరించాలో ఇక్కడ తెలుసుకుందాం…
వారంలో మొదటి రోజైన ఆదివారం ఆ సూర్యభగవానుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. కాబట్టి ఆదివారం మహిళలు కెంపులతో తయారుచేసిన నగలను ధరించాలి. సోమవారం చంద్రుడికి ఇష్టమైన రోజు కాబట్టి మహిళలు ముత్యాల హారాలు, గాజులు ధరించాలి. వారంలో మూడవ రోజైన మంగళవారం కుజుడికి ఎంతో ప్రీతికరమైన రోజు కనుక మంగళవారం పగడాల దండలు, ఉంగరాలు ధరించటం వల్ల ప్రమాదాల నుండి విముక్తి పొందవచ్చు.
బుధవారం బుధ గ్రహానికి ఎంతో అనుకూలమైన రోజు. బుద్ధుడుకి ఆకుపచ్చ రంగు అంటే ఎంతో ఇష్టం కనుక మహిళలు బుధవారం పచ్చల పతకాలు, గాజులు ధరించాలి. గురువారం బృహస్పతి గ్రహానికి ఎంతో అనుకూలమైన రోజు. ఈరోజు మహిళలు పుష్ప రాగపు కమ్మలు, ఉంగరాలు ధరించుకోవాలి. శుక్రవారం శుక్రుడిని ఎంతో ఇష్టమైన వజ్రాల హారం, ముక్కుపుడక ధరించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇకపోతే వారం లో చివరి రోజైన శనివారం శనికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు మహిళలు శనికి ఎంతో ఇష్టమైన నీలమణితో తయారు చేయించుకున్న హారాలు, కమ్మలు, ముక్కుపుడక ధరించడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది.ఈ విధంగా మహిళలు వారంలో ఏడు రోజులు ఏడు రకాల నగలు ధరించడం వల్ల సకల సంపదలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు.