Israel VS Hamas : పాలస్తీనాకు సమర్ధన ముసుగులో హమాస్ చర్యలకు ఊతమా?

హమాస్ దాడులను తీర్మానంలో కాంగ్రెస్ పార్టీ ఖండించకపోవడంతో ఇంత దారుణంగా దేశంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందా? అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Written By: NARESH, Updated On : October 10, 2023 9:38 pm

Israel VS Hamas

Follow us on

Israel VS Hamas : ఇజ్రాయిల్ పై హమాస్ దాడిని కాంగ్రెస్ పార్టీ ఖండించలేదు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానించిన తీర్మానంలో హమాస్ చేసిన క్రూరదాడిని ఎక్కడ ఖండించలేదు. పాలస్తీనాకు మద్దతు ఇచ్చినట్టుగా కాంగ్రెస్ తీర్మానం ఉంది. అసదుద్దీన్ ఓవైసీ, మహబూబా ముక్తీలు ఇలా మాట్లాడారంటే మనం అర్థం చేసుకోవచ్చు. అలీగడ్ ముస్లిం యూనివర్సిటీలో అలాంటి ప్రదర్శన చేశారంటే దానికి వారి శత్రుత్వం ఉందని చెప్పొచ్చు.

ఇజ్రాయిల్, హమాస్ ఉగ్రవాదుల మధ్య వైరం ఈనాటిది కాదు. కానీ కొన్ని దశాబ్దాలుగా ఇజ్రాయిల్ హమాస్ ఉగ్రవాదులపై పైచేయి సాధిస్తూ వస్తూంది. అయితే వారి అంచనాలను తలకిందులు చేస్తూ హమాస్ ఉగ్రవాదులు కోలుకోలేని దెబ్బతీశారు. ఇందుకు గత శనివారం ఇజ్రాయిల్ దేశంలో జరిగిన ఒక మ్యూజిక్ పార్టీని హమాస్ ఉగ్రవాదులు తమ నరమేధానికి వేదికగా చేసుకున్నారు. గత శనివారం గాజాలోని కిబ్బుజ్ రీమ్ వద్ద నోవా పేరుతో ఇజ్రాయిలీలు ఒక పార్టీ నిర్వహించారు. జనం ఆ కార్యక్రమానికి 3000 మంది దాకా హాజరయ్యారు. పలు వ్యాన్లలో 50 మంది సాయుధ ముష్కరులు అక్కడికి వచ్చారు. డీజే సౌండ్ వినిపిస్తుండగా.. రాకెట్లు దూసుకు వచ్చాయి. హమాస్ ఉగ్రవాదులు కూడా తూటాల వర్షం కురిపించారు. భయకంపితులైన యువతీ యువకులు రోడ్లమీదకి పరుగులు తీశారు. దొరికిన వారిని దొరికినట్టే ముష్కరులు చంపేశారు. అందరు చూస్తుండగానే యువతులపై రేప్ లు చేశారు. మహిళలను ఎత్తుకు వెళ్లారు. కొందరిని అత్యంత క్రూరంగా చంపి వాటిని వీడియో రూపంలో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

హమాస్ దాడులను తీర్మానంలో కాంగ్రెస్ పార్టీ ఖండించకపోవడంతో ఇంత దారుణంగా దేశంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందా? అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.