Congress- TRS: దేశంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసేందుకు ఇప్పటికే ప్రాంతీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. అయితే కాంగ్రెస్ లేకుండా ఏ కూటమీ సాధ్యం కాదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో స్ట్రాటజిస్టు ప్రశాంత్ కిశోర్ బీజేపీకి వ్యతిరేక పార్టీలను ఒక్కటి చేసే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ, టీఆర్‌ఎస్‌కు ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ఆయన కాంగ్రెస్‌తో కలిస్తేనే వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించగలమన్న అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో గతంలో కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేసిన పీకే తాజాగా ఆ పార్టీకి దగ్గరవుతున్నారు. అవసరమైతే ఆ పార్టీలో చేరాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు బీజేపీ ఉమ్మడి శత్రువు అయినందున పీకే చొరవతో ఈ పార్టీలు మిత్రులవుతాయా అన్న ప్రశ్న తలెత్తుతోంది.

-రాష్ట్రంలో ఉప్పు నిప్పు…
రాష్ట్రం రాజకీయాల విషయానికొస్తే ఇక్కడ కాంగ్రెస్, టీఆర్‌ఎస్ ఉప్పు నిప్పుగా ఉన్నాయి. టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని కాంగ్రెస్ చెతుంటే.. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను ఇప్పటికే చావుదెబ్బ కొట్టిన కేసీఆర్ ఆ పార్టీ కోలుకోకుండా చేస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి పగ్గాలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్‌లో కొంత జోష్ పెరిగింది. క్యాండర్‌లో కొత్త ఉత్సాహం వచ్చింది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌తో ఢీ అంటే ఢీ అంటున్నారు. రాష్ట్రంలో యాసంగిలో రైతులను వరి వేయొద్దన్న కేసీఆర్ తన ఫాంహౌస్‌లో 150 ఎకరాల్లో వరి వేసిన విషయాన్ని రేవంత్‌రెడ్డే వెలుగులోకి తెచ్చారు. తాజాగా విద్యుత్, ఆర్టీసీ చార్జీల పెంపుపైనా ఉద్యమిస్తున్నారు. వడ్ల కొనుగోళ్ల విషయంలో రేవంత్‌రెడ్డి కేంద్రం కంటే రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్‌పైనే ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో రెండు పార్టీల మధ్య అవగాహన సాధ్యమా అన్న ప్రశ్న తలెత్తుతోంది.
Also Read: AP Politics: ఎందుకీ దర్పాలు.. ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్న ప్రభుత్వ పాలకులు
-రేవంత్ టార్గెట్ కేసీఆరే..
తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రధాన లక్ష్యం కేసీఆరే. గతంలో ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డిని సీఎం కేసీఆర్ జైలుకు పంపించారు. నాడు టీడీపీలో ఉన్న రేవంత్‌రెడ్డి రిమాండ్ అనంతరం జైలు నుంచి విడుదలైన తర్వాత భారీ ర్యాలీగా నిర్వహించారు. ఇక నుంచి తన టార్గెట్ కేసీఆరే అని నాడే ప్రకటించారు. తర్వాత రాష్ట్రంలో టీడీపీ బలహీనపడడం, ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా గులాబీ గూటికి వెళ్లడంతో రేంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. అనతికాలంలోనే తన దూకుడుతో టీపీసీసీ పగ్గాలు చేపట్టారు. ప్రస్తుతం ఎక్కడ మీటింగ్ పెట్టినా.. ఎక్కడ ఆందోళనలు చేసినా ఆయన కేసీఆర్, కేటీఆర్ లక్ష్యంగానే విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్ 111 జీవోను ఉల్లంఘించి ఫామ్‌హౌస్ నిర్మించుకున్నారని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ దందాతో కేటీఆర్‌కు, సినీ నటులకు ఉన్న సంబంధాలను బయటపెట్టే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో కేటీఆర్ కోర్టు నుంచి స్టే తెచ్చుకునేలా చేశారు. తాజాగా కేసీఆర్ తన ఫాంహౌస్‌లో వరి సాగుచేసిన విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లోనే భారీ బహిరంగ సభ నిర్వహించి పాతాళంలోకి తొక్కేస్తా అంటూ నినదించారు. ఈ పరిణామాలను బట్టి రేవంత్‌రెడ్డి ప్రధాన టార్గెట్ టీఆర్‌ఎస్ కాదని, తనను జైలుకు పంపిన కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆరే అని కాంగ్రెస్ నేతలు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

-గతంలో కాంగ్రెస్‌పై పీకే విమర్శనాస్త్రాలు.. ఏడాది క్రితం వరకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిశోర్ కాంగ్రెస్, రాహుల్‌గాంధీ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు.
– కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించడం ఏ ఒక్కరికి దేవుడిచ్చిన హక్కు కాదన్నారు. గత 10 ఏళ్లలో కాంగ్రెస్ 90 శాతం ఎన్నికల్లో ఓటమిపాలైందని విమర్శించారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్‌లో చేరేందుకు నెల క్రితం వరకు రాహుల్ గాంధీతో చర్చలు జరిపిన పీకే.. ఇప్పుడు హస్తం పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
–‘బలమైన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పాత్ర చాలా కీలకం. కానీ ఆ పార్టీకి నాయకత్వం వహించడం ఒక్కరికే దేవుడిచ్చిన హక్కు కాదు. గత 10 ఏళ్లలో కాంగ్రెస్ 90 శాతం ఎన్నికల్లో ఓటమి పాలైంది. ఇక విపక్షాలు తమ సారథిని ప్రజాస్వామ్యపరంగా ఎన్నుకోవాలి. అన్నారు.
–‘ఓ వ్యక్తి ఏమీ చేయకుండా.. ఎప్పుడూ విదేశాల్లో గడుపుతుంటే, ఇక ఇక్కడి రాజకీయాలు ఎవరు చేస్తారు? రాజకీయాల్లో ఉన్నవాళ్లు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలి’ అని ట్వీట్ చేశారు.
–తాజాగా మళ్లీ కాంగ్రెస్‌తో దోస్తీకి యత్నిస్తున్నారు. తన ఎన్నికల వ్యూహాలతో జాతీయస్థాయిలో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న పీకే ప్రత్యక్ష ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంటున్నారు. ఈ క్రమంలో గతంలో ఆర్జేడీలో చేరారు. తర్వాత నితీశ్‌కుమార్‌తో విభేదాలు రావడంతో పార్టీని వీడారు. బీజేపీ ఆయనను దగ్గరకు రానివ్వడం లేదు. దీంతో ఆయనకు కాంగ్రెస్ ఒక్కటే ప్రత్యామ్నాయంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అందుకే మళ్లీ సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలతో సమావేశం అవుతున్నట్లు భావిస్తున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో తన సత్తా చాటడంతోపాటు కాంగ్రెస్‌ను గెలిపిస్తే దేశ రాజకీయాల్లో తనకు తిరుగు ఉండదన్న భావనతోనే పీకే కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో బీజేపీ వ్యతిరేక పార్టీలను కాంగ్రెస్‌కు దగ్గర చేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇలాంటి తరుణంలో తెలంగాణలలో కాంగ్రెస్‌కు అధికార టీఆర్‌ఎస్‌ను దగ్గర చేయడం సాధ్యమా అన్న ప్రశ్న తలెత్తుతోంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అన్నట్లు మారుతున్న రాజకీయాలు తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను ఎటువైపు నడిపిస్తాయో వేచిచూడాలి.
Also Read:TRS Foundation Day: ఏప్రిల్ 27వ టీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం.. కేసీఆర్ మళ్లీ ఏం చేస్తారో?