Congress 2nd list : వైఎస్ఆర్, పీజేఆర్.. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రాన్ని శాసించిన వ్యక్తులు.. ఈ కాంగ్రెస్ అగ్రనేతలు నాడు పార్టీలో ఏది అంటే అది జరిగిపోయేది. ఇద్దరూ తమ ఆధిపత్యాన్ని చెలాయించేవారు. పీజేఆర్ అంటే పడకున్నా కానీ వైఎస్ఆర్ గౌరవించేవాడు.. ఇద్దరూ కలిసి సాగకున్నా పార్టీ కోసం కష్టపడి పనిచేసేవారు. అంతిమంగా పార్టీ గెలుపు కోసం కృషి చేసేవారు. వైఎస్ఆర్ తనకు ఎప్పుడూ ప్రత్యర్థిగా ఉన్నా కూడా ఖైరతాబాద్ సీటును మాత్రం పీజేఆర్ కు.. ఆయన వారసులకే ఇచ్చేవారు.
వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఖైరతాబాద్ ను పీజేఆర్ ఫ్యామిలీకే ఇచ్చారు. ఆయన కొడుకును ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. నియోజకవర్గ పునర్విభజనకు ముందు దేశంలోనే అతిపెద్ధ నియోజకవర్గంగా ఖైరతాబాద్ ఉండేది. పునర్విభజనలో ఖైరతాబాద్ నుంచి 5 నియోజకవర్గాలను వేరే చేశారు. ఖైరతాబాద్ నుంచి గతంలో పీ. జనార్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టాడు.
పీజేఆర్ మరణం తర్వాత మొదట ఖైరతాబాద్ నుంచి నిలబడి పీజేఆర్ తనయుడు పీ. జనార్ధన్ రెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత ఖైరతాబాద్ నుంచి విడదీసి కొత్తగా ఏర్పడిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి విష్ణువర్ధన్ రెడ్డి గెలిచారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయారు.
2018 ఎన్నికల్లో ఓడిపోయాక విష్ణువర్ధన్ రెడ్డి రాజకీయాల్లో యాక్టివ్ గా లేరు. ఇక సీనియర్లు పోటీలో ఉండడంతో ఈసారి జూబ్లీహిల్స్ ను మహ్మద్ అజారుద్దీన్ కు కాంగ్రెస్ కేటాయించింది. ఇక ఖైరతాబాద్ ను పీజేఆర్ కూతురు పి. విజయారెడ్డికి కేటాయించి పీజేఆర్ వారసుడు అయిన విష్ణువర్ధన్ కు కాంగ్రెస్ అధిష్టానం మొండిచేయి చూపింది. ఇన్నేళ్ల ఖైరతాబాద్ చరిత్రలో పీజేఆర్ వారసుడికే ఈసారి టికెట్ దక్కకపోవడం గమనార్హం.