F3 Actor Pradeep: F2 మరియు F3 సినిమాలలో హీరోయిన్ తండ్రి గా ‘అంతే గా అంతే గా’ అనే డైలాగ్ వేస్తూ బాగా పాపులర్ అయినా నటుడు ప్రదీప్..ఈయన పేరు చెప్తే ఎవ్వరు గుర్తుపట్టలేకపోవచ్చు కానీ, ముఖం చూస్తే మాత్రం కచ్చితంగా గుర్తుపట్టగలరు..ప్రముఖ దర్శకుడు జంధ్యాల తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ‘ముద్ద మందారం’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు ప్రదీప్..తొలి సినిమా సూపర్ హిట్ అవ్వడం ఆయనకీ పలు సినిమాల్లో హీరో గా నటించే అవకాశం కూడా దక్కింది..కానీ ఆయన హీరోగా చేసిన సినిమాలు అన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి..ఇక అప్పటి నుండి క్యారక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో మరియు సీరియల్స్ లో నటించాడు..నేటి తరం ప్రేక్షకులకు మాత్రం ఆయన F2 సినిమా ద్వారానే బాగా సుపరిచితం..అయితే ఈయన ఫ్లాష్ బ్యాక్ తెలిస్తే ప్రతి ఒక్కరికి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..అదేమిటో ఇప్పుడు మనం చూడబోతున్నాము.

Pradeep
Also Read: Congress TRS: అయితే టీఆర్ఎస్.. లేదంటే ఆప్షన్ కాంగ్రెస్ యేనా?
ప్రదీప్ మనకి కేవలం ఒక ఆర్టిస్టుగా మాత్రమే పరిచయం..కానీ ఆయన గతం లో సత్యం కంపెనీ హ్యూమన్ రిసోర్స్ మేనేజర్ (HR) గా 2006 వ సంవత్సరం నుండి పని చేసాడు..ఒక పక్క ఇంత పెద్ద జాబ్ చేస్తూనే మరో పక్క ఖాళి సమయం దొరికినప్పుడల్లా సినిమాలు మరియు సీరియల్స్ చేస్తూ ఉంటాడు..వీటితో పాటు ఈయన వ్యక్తిత్వ వికాసం క్లాసులు కూడా తీసుకుంటూ ఉంటాడు..అంతే కాకుండా యాంకరింగ్ చెయ్యాలనే ఉత్సాహం ఉన్న వారికి ప్రత్యేకమైన వర్క్ షాప్స్ కూడా నిర్వహించి ట్రైనింగ్ ఇస్తుంటాడు..ఇది ఇలా ఉండగా సత్యం కంపెనీ కుంభకోణం లో మునిగిపోయి దివాలా తీసిన సంగతి మన అందరికి తెలిసిందే..అప్పట్లో ఈ సంఘటన IT రంగం లో పెనుదుమారమే రేపింది..అయితే ఈ కంపెనీ ని స్థాపించిన రామ లింగరాజు గారు ‘కంపెనీ లో చాలా అవకతవకలు జరుగుతున్నాయి..అతి త్వరలోనే ఈ కంపెనీ ముంగిపోబోతుంది’ అంటూ ప్రదీప్ తో మాట్లాడుతూ బాధ పడుతూ ఉండేవాడట..ఆయన స్థానం లో వేరే వాళ్ళు ఉంది ఉంటె కచ్చితంగా ఎంప్లాయిస్ అందరిని జాబ్ నుండి పీకేసేవారని..కానీ రామ లింగరాజు గారు తన కంపెనీ లో పని చేస్తున్న 52000 మందిలో ఒక్కరిని కూడా జాబ్ నుండి తొలగించలేదని చెప్పుకొచ్చాడు ప్రదీప్..అప్పట్లో నేను ‘వీ ఆర్ విత్ యు సత్యం’ అని చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసానని ప్రదీప్ ఈ సందర్భంగా తెలిపాడు..ఇక రామ లింగ రాజు గారు కంపెనీ ని వదిలి వెళ్లిపోయిన తర్వాత సత్యమూర్తి గారు వచ్చారని..ఆయన కూడా నాకు చాలా దగ్గర మనిషి అయ్యేసరికి జాబ్ మానలేక అలాగే కొనసాగాను అని చెప్పుకొచ్చాడు ప్రదీప్..ప్రస్తుతం ప్రదీప్ ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క సీరియల్స్ చేస్తూ ఫుల్ బిజీ గా గడుపుతున్నాడు.

Actor Pradeep