Puri-Lavanya Love Marriage: ఆయన సినిమాల్లాగే పూరి జగన్నాథ్ రియల్ లైఫ్ కూడా డైనమిక్ గా ఉంటుంది. ప్రేమకథలు దగ్గర నుండి సక్సెస్ ఫెయిల్యూర్స్ ఇలా అనేక ట్విస్ట్స్ టర్న్స్ చోటు చేసుకున్నాయి. భార్య లావణ్యను పూరి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అది కూడా లేపుకొచ్చి గుడిలో తాళి కట్టారు. దర్శకుడిగా ప్రయత్నాలు చేస్తున్న రోజుల్లో లావణ్య ప్రేమలో పడ్డారు పూరి. కొన్నాళ్ళు ఆమె చుట్టూ తిరిగి మనసును గెలుచుకున్నారు. లైఫ్ లో సెటిల్ కాలేదు. అయినా తప్పదు పెళ్లి చేసుకోవాలి. జేబులో డబ్బులు ఉన్నాయా? లేవా? పెళ్లి చేసుకుంటే ఆమెను నేను చూసుకోగలనా? లేనా? అనే ఆలోచనలు లేవు. నేను సక్సెస్ అవుతాను. ఆమెకు మంచి జీవితం ఇస్తాననే మొండి ధైర్యం.

అప్పటికి ఇండస్ట్రీలో ఉన్న మిత్రుల మద్దతుతో పూరి, లావణ్య వివాహం గుడిలో జరిగింది. ఈ పెళ్ళికి కనీసం తాళిబొట్టు కొనే స్తోమత కూడా పూరికి లేదు. ఆ తాళిబొట్టు అప్పటి స్టార్ యాంకర్ ఝాన్సీ కొనిచ్చారట. ఇక పెళ్లి బట్టలు నటి హేమ కొన్నారట. పెళ్లి తర్వాత ఫ్రెండ్స్ చిన్న పార్టీ ఏర్పాటు చేశారట. ఆ విధంగా యాంకర్ ఝాన్సీ, హేమ పూరికి సహాయం చేశారు. పూరి స్టార్ డైరెక్టర్ గా ఎదిగాక వారికి తన చిత్రాల్లో రోల్స్ ఇచ్చారు. ముఖ్యంగా హేమ పూరి దర్శకత్వంలో తెరకెక్కిన అనేక చిత్రాల్లో నటించారు.

Also Read: Puri Jagannadh- Charmi: హీరోయిన్ ఛార్మి వల్ల పూరి జగనాథ్ ఇంట్లో గొడవలు
1996లో పూరి-లావణ్య వివాహం జరిగింది. పూరి డైరెక్ట్ చేసిన మొదటి చిత్రం బద్రి 2000లో విడుదలైంది. పెళ్ళైన నాలుగేళ్లకు ఆయనకు మొదటి సినిమా ఆఫర్ వచ్చిందన్న మాట. అప్పటి నుండి పూరి జగన్నాధ్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, శివమణి ఇలా వరుస హిట్స్ ఇచ్చారు. 2006 లో విడుదలైన పోకిరి పూరి కెరీర్ లో అతిపెద్ద హిట్ గా ఉంది.

పూరి టేకింగ్, డైలాగ్స్ కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన హీరోయిజం కి కొత్త అర్థం చెప్పారు. ఒక దశలో స్నేహితులను నమ్మి ఉన్నదంతా పోగొట్టుకున్నారు. వరుస ప్లాప్స్ తో డీలా పడ్డారు. కెరీర్ లో సంపాదించింది అంతా పోయింది. పోయిన చోటే వెతుక్కోవాలని తెల్సిన పూరి… ఉన్నదంతా ఊడ్చి ఇస్మార్ట్ శంకర్ మూవీ చేశారు. ఈ చిత్రం అనూహ్యంగా విజయం సాధించింది. పూరి సొంత బ్యానర్ లో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ రూ. 75 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ అందుకుంది. ఆ దెబ్బతో పూరి కష్టాలు తీరాయి.
Also Read: Rajinikanth- Rakshit Shetty: సినిమా చూసి ఆ యంగ్ హీరోకి కాల్ చేసిన రజినీకాంత్!
[…] Also Read: Puri-Lavanya Love Marriage: పూరి-లావణ్యల ప్రేమ వివాహం…… […]
[…] Also Read: Puri-Lavanya Love Marriage: పూరి-లావణ్యల ప్రేమ వివాహం…… […]