ఈ మధ్య కాలంలో చాలామందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో అరికాళ్ల మంటలు కూడా ఒకటి. పాదాల్లో నాడులు దెబ్బతినడం వల్ల ఈ సమస్య బారిన పడే అవకాశం ఉంటుంది. షుగర్ బారిన పడ్డవాళ్లు ఎక్కువగా ఈ సమస్యతో బాధ పడుతుంటారు. కొందరిలో మానసిక సమస్యల వల్ల కూడా అరికాళ్లలో మంట సమస్య వేధించే అవకాశం ఉంటుంది. కాళ్లలో రక్తనాళాలు దెబ్బతిన్నా, అరికాళ్లలో ఇన్ఫెక్షన్ సోకినా ఈ సమస్య వేధించే అవకాశం ఉంటుంది.
బి12 విటమిన్ లోపం వల్ల కూడా ఈ సమస్య వేధించే అవకాశం ఉంటుంది. బి12 విటమిన్ లోపిస్తే శరీరంలో నాడులు దెబ్బతింటాయి. అతిగా మద్యం తాగినా బి12 విటమిన్ లోపం తలెత్తే అవకాశాలు ఉంటాయి. నాడులు దెబ్బ తింటే నర్వ్ కండక్షన్ స్టడీ చేయడంతో పాటు నాడులలోని చిన్నముక్కను పరీక్ష చేయాల్సి ఉంటుంది. నిపుణులైన వైద్యులను సంప్రదించడం ద్వారా ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
బి12 విటమిన్ ఎక్కువగా లభించే గుడ్లు, చేపలు, మాంసం తినడం వల్ల కూడా ఈ సమస్యకు సులువుగా చెక్ పెట్టవచ్చు. కొంతమందిలో ఏ కారణం లేకుండానే అరికాళ్లలో మంటలు సమస్య వస్తుంది. అరికాళ్లలో మంటలు సమస్య వేధిస్తుంటే అరికాళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ సమస్యతో ఇబ్బంది పడేవాళ్లను పుండ్లు కూడా తీవ్రంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది.
అరికాళ్లలో మంటలు వెన్నుపాము జబ్బులు, రక్తప్రసరణలో ఇబ్బందులు లాంటి సమస్యలకు కూడా కారణమయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమస్యతో బాధ పడుతుంటే నిర్లక్ష్యం వహించకుండా వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకుంటే మంచిది