CM KCR On Job Notifications : తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ పార్టీ నేతలు భోళా శంకరుడితో పోలుస్తారు. ఆయనకు ఆవేశం వచ్చినా.. అనుగ్రహం వచ్చినా మీద పడిపోతుందని అంటారు. నిన్నటివరకూ కేసీఆర్ మీద రాళ్లేసిన నిరుద్యోగులే ఈరోజు కేసీఆర్ అసెంబ్లీలో చేసిన 91వేల పోస్టుల భర్తీతో ఆయనపై పాలాభిశేకం చేస్తున్నారు. ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి టపాసులు కాల్చి కేసీఆర్ కు అనుకూలంగా నినాదాలు చేశారు. కేసీఆర్ దిష్టిబొమ్మను కాల్చినవారే ఇప్పుడు పాలాభిషేకాలు చేయడం విశేషం.

తెలంగాణ ఉద్యమం సాగిందే నీళ్లు , నిధులు, నియామకాల గురించే.. నీళ్లు కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతలతో వచ్చేశాయి. నిధులు సరిపడా ఉన్నాయి. అభివృద్ధి సాగుతోంది. అయితే నియామకాలు మాత్రం తెలంగాణ ఏర్పడకముందు నుంచే తెలంగాణ ఉద్యమ సమయం నుంచే జరగలేదు. రాష్ట్రపతి ఉత్తర్వులు, స్థానికేతర సమస్య, జోనల్ సిస్టంతో ఇన్నాళ్లు జాప్యం జరిగింది. అందుకే ఉద్యోగాల కోసం కేసీఆర్ సర్కార్ పై కారాలు మిరియాలు నూరారు నిరుద్యోగులు. ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. తాజాగా కేసీఆర్ వారికి తీపి కబురును అందించాడు.
కేసీఆర్ అసెంబ్లీలో ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. తక్షణం 80039 కొత్త ఉద్యోగాలకు నేటి నుంచే నోటిఫికేషన్లు ఇవ్వడంతోపాటు 11వేల కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. జాబ్ క్యాలెండర్ కూడా ప్రతీ సంవత్సరం ఉంటుందని తెలుపడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ 95 శాతం స్థానిక కోటాతో రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించామని తెలిపారు. అటెండర్ నుంచి ఆర్డీవో వరకూ 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు వస్తాయన్నారు. 5శాతం మాత్రమే స్థానికేతరులకు వస్తాయని వివరించారు. నియామకాల్లో 95 శాతం స్థానిక కోటా సాధించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.
-తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే ఇది అత్యధిక నియామకాలు
తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే అత్యధికంగా ఉద్యోగాల భర్తీతో కేసీఆర్ చరిత్ర సృష్టించారు. గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకూ వేల పోస్టులను భర్తీ చేసి సంచలనం రేపారు. వందో రెండు వందలు మాత్రమే భర్తీ అయ్యే గ్రూప్స్ ఉద్యోగాలను 500 నుంచి 9వేలవరకూ ప్రకటించి నిరుద్యోగులకు తీపికబురునందించాడు.
-ఉద్యోగ ఖాళీల వివరాలు
హోంశాఖలో అత్యధికంగా 18344 పోస్టులు, విద్యాశాఖ లో 13086 ఉద్యోగాలు, వైద్య ఆరోగ్యశాఖలో 12755, ఉన్నత విద్యాశాఖలో 7878, బీసీ సంక్షేమ శాఖలో 4311 పోస్టులను భర్తీ చేయనున్నారు.
-కొన్ని కీలక విభాగాల పోస్టుల సంఖ్య ఇదీ
గ్రూప్ 1 : 503
గ్రూప్ 2: 582
గ్రూప్ 3: 1373
గ్రూప్ 4: 9169
పోలీస్ :18334
రెవెన్యూ : 3560
సెకండరీ విద్య: 13086
ఉన్నత విద్య -7878
-ఉద్యోగ ఖాళీల పూర్తి వివరాలు