Mokshagna- Rahul Sankrityan: నందమూరి మోక్షజ్ఞని వెండి తెరపై చూడాలని అభిమానులు చాలా కాలంగా ఆశ పడుతున్నారు. కానీ, అది అందరి ద్రాక్షగానే మిగిలిపోతూ వస్తోంది. నందమూరి బాలయ్య కూడా తన సినీ వారసుడిగా నందమూరి మోక్షజ్ఞని ప్రమోట్ చేయాలని ఆ మధ్య చాలా ప్రయత్నాలు చేశాడు. నందమూరి అభిమానులు కూడా మోక్షజ్ఞ ఎంట్రీ ఫోటోలను డిజైన్ చేసుకుని.. ఎనౌన్స్ రాగానే వైరల్ చేద్దాం అని కాసుకొని కూర్చున్నారు. కానీ, వినాయకుడి పెళ్లిలా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కూడా వాయిదా పడుతూనే వస్తోంది.

అసలు మోక్షజ్ఞకు ఇంతకీ యాక్టింగ్ పై ఇంట్రస్ట్ ఉందా ?, ఒకవేళ లేకపోతే బాలయ్యది కూడా ఏమి చేయలేని పరిస్థితే. ఇన్నాళ్లు వారసుడి రాకకు ముహూర్తం కుదర్లేదు అంటూ బాలయ్య కబుర్లు చెప్పినా…కొన్నాళ్ళు పోతే అది కూడా చెప్పలేడు. ఈ భయమే బాలయ్యలో ఎక్కువగా ఉంది. అందుకే.. సడెన్ గా మోక్షజ్ఞ లో మార్పు వచ్చింది అంటూ, తన సన్నిహితులకు చెప్పి ఓ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. తండ్రి మాటను కాదనలేని పరిస్థితి మోక్షజ్ఞ ది.
అందుకే, బాలయ్య మాటకు ఎదురు చెప్పలేదు. త్వరలో ముఖానికి రంగు వేసుకోవడానికి మోక్షజ్ఞ రెడీ అవుతున్నాడు. కానీ, ఎంతవరకు ఇది సెట్ అవుతుంది ?, ఇప్పటికీ తన ఫిజిక్ పై మోక్షజ్ఞ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కనిపించడం లేదు. కాకపోతే, ఆ మధ్య వైరల్ అయిన పిక్స్ తో పోల్చుకుంటే.. ఈ మధ్య వైరల్ అయిన పిక్స్ కాస్త బెటర్. సహజంగానే మోక్షజ్ఞ బాగా లావు, పైగా కాస్త పొట్ట కూడా ఎక్కువే.
మొత్తానికి హీరో అయ్యే లక్షణాలు ఏవీ తనలో ఎంతమాత్రం లేవు అన్నట్లు ఉంటాడు మోక్షజ్ఞ. మరి ఇలాంటి హీరోతో సినిమా చేసి నష్టపోయే ఆ నష్ట జాతకుడు ఎవరో చూడాలి. బోయపాటి నుంచి క్రిష్ వరకూ చాలామంది దర్శకుల పేరు పేర్లు మోక్షజ్ఞ ఎంట్రీ సినిమా కోసం వినిపించాయి. తాజాగా రాహుల్ సంకృత్యయిన్ పేరు కూడా బాగా వినిపిస్తోంది. 20 రోజుల క్రితం రాహుల్ సంకృత్యయిన్ బాలయ్యని కలిసి కథ చెప్పాడట. బాలయ్యకి కథ బాగా నచ్చింది.అందుకే, వెంటనే ఈ సినిమా ఓకే చేశాడని టాక్.

రాహుల్ సంకృత్యయిన్ కూడా బాలయ్యకి బాగా క్లోజ్ అయ్యాడట. దాంతో అతనితో బాలయ్యకి కూడా సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయట. అందుకే, తన కుమారుడి మొదటి సినిమాని రాహుల్ సంకృత్యయిన్ తో చేస్తేనే బెటర్ అని బాలయ్య కూడా అంగీకరించాడట. ప్రస్తుతం రాహుల్ సంకృత్యయిన్ ఈ సినిమా కథ పైనే కసరత్తులు చేస్తున్నాడు. మొత్తానికి రాహుల్ సంకృత్యయిన్ బాలయ్యని పట్టాడు, మోక్షజ్ఞ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు.