Bholaa Shankar Teaser : మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటిస్తున్న ‘భోళా శంకర్’ మూవీ ఈ ఏడాది ఆగష్టు 11 వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటి నుండే ప్రారంభించబోతున్నారు మేకర్స్. ఇది వరకే ఈ సినిమాకి సంబంధించిన మొదటి పాటని రీసెంట్ గానే విడుదల చేసారు. దానికి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమాకి సంగీతం మెలోడీ బ్రహ్మ మణిశర్మ కొడుకు మహతి సాగర్ అందించాడు. ఇక పోతే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని కాసేపటి క్రితమే విడుదల చేసింది మూవీ టీం. ‘వాల్తేరు వీరయ్య’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తున్నా సినిమా కావడం తో ఈ మూవీ పై అభిమానులు మొదటి నుండే భారీ అంచనాలను పెట్టుకున్నారు, ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ టీజర్ కట్ ని కూడా సిద్ధం చేసాడు మెహర్ రమేష్.
కాసేపటి క్రితమే విడుదలైన ఈ టీజర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము.ఈ సినిమా తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన అజిత్ ‘వేదాలం’ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ టీజర్ చూస్తున్నప్పుడు కూడా అదే అనిపించింది, ఒక సన్నివేశాన్ని మక్కీకి దింపేశాడు డైరెక్టర్ మెహర్ రమేష్. అయితే ఈ చిత్రం లో డిఫరెంట్ గా అనిపించింది ఏదైనా ఉందా అంటే అది మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ స్లాంగ్.
చిరంజీవి కి తెలంగాణ స్లాంగ్ ఏమి కొత్త కాదు, గతం లో కూడా ఆయన చాలా సినిమాల్లో ఆ స్లాంగ్ వాడాడు, ఈ టీజర్ లో కూడా ఆయన తెలంగాణ స్లాంగ్ ఫ్యాన్స్ కి సూపర్ గా అనిపించింది. ‘షికారికి వెళ్లిన షేర్ ని బే’ అంటూ చిరంజీవి చెప్పిన డైలాగ్ కి రెస్పాన్స్ బాగుంది. ఇక టీజర్ చివర్లో ‘ఈ స్టేట్ డివైడ్ అయినా అందరూ నా వాళ్ళే , ఆల్ ఏరియాస్ నావే, నాకు హద్దులు సరిహద్దులు లేవు,ఆగష్టు 11 దేఖ్లేంగే ‘ అంటూ చిరు చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. పక్క కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఫ్యాన్స్ ని ఎలా అలరిస్తుందో చూడాలి.