Nandyala Srinu : కళ కళ కోసం అని నమ్మేవాడే నిజమైన కళాకారుడు. ఎంత గొప్ప కళ అయినా అందర్నీ ఆకర్షించదు.. ఆకర్షించలేదు. భగవంతుడి కోసం కళను ప్రదర్శించిన త్యాగయ్య, అన్నమయ్యలు ఉత్తమ కళాకారులయ్యారు. సంగీతానికి మార్గం చూపి ఆదర్శులయ్యారు. త్యాగయ్య రాముడి కోసం, అన్నమయ్య వేంకటేశ్వరుడి కోసం పదకవితలు ఆలపించినా అవి విశ్వజనీతమయ్యాయి. భావితరాలకు అనుసరణీయంగా మారాయి. కళకు ఎల్లలు ఉండవు. వయసు భేదం అంతకంటే ఉండదు. కుల, మత, వర్గ , ప్రాంత, భాష వైషమ్యాలు అంతకంటే ఉండవు. అందుకే కళ అంత గొప్పదయ్యింది. చాలా మందిలో చిన్నానాటి నుంచే కళా తృష్ణ ఉన్నా సాకారం చేసుకునేది కొందరే. ఆత్మనూన్యతా భావం, కుటుంబ పరిస్థితులు అడ్డంకిగా నిలుస్తాయి. ప్రతిబంధకంగా మారతాయి.
కానీ ఓ రైతు ఐదు పదుల వయసులో కళాకారుడిగా రాణించాలనుకుంటున్నారు. ప్రాథమిక స్థాయిలో కుటుంబ పరిస్థితులు అడ్డంకిగా నిలవగా.. యుక్త వయసులో వైవాహిక జీవితం, పిల్లలు వారి బాధ్యతలు ప్రభావం చూపాయి.అయినా సరే తనలో ఉన్న ‘కళాభిమానం’ పోలేదు. ఇప్పుడు పిల్లల బాధ్యతలు తీరిపోయేసరికి..నడి వయస్సులో కళాకారుడిగా ఎదిగాలన్న బలమైన ఆకాంక్ష బయటపెట్టాడు. దానికి పిల్లలు, కుటుంబసభ్యులు, బంధువులు ఆమోదముద్ర వేసేసరికి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు, కళా సమాజాన్ని జయించేందుకు బయలుదేరారు. ఆయనే వణుకూరు శ్రీనివాస్ రెడ్డి అలియాస్ “నంద్యాల శ్రీను”
శ్రీనుకు ప్రాథమిక స్థాయి నుంచే నాటకాలంటే మక్కువ. పాఠశాల స్థాయిలోనే ఎన్నోరకాల నాటకాలు వేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. బహుమతులు అలవోకగా కైవసం చేసుకునే వారు. ఆ కళా తృష్ణ తనతో పాటు పెరుగుతూ వచ్చింది. గ్రామంతో పాటు పరిసర గ్రామాల్లో నాటకాలు వేయాలంటే శ్రీను ఉండాల్సిందేనన్న పేరు సొంతం చేసుకున్నారు. కానీ నాటకాల పిచ్చితో ఎక్కడ భవిష్యత్ పాడుచేసుకుంటాడో అని తండ్రి భయపడి అభ్యంతరం వ్యక్తం చేసేవాడు. మందలించేవాడు. కానీ మీ వాడు మంచి కళాకారుడు అనేసరికి మురిసిపోయేవాడు. నటుడిగా కుమారుడు మరింత రాణించాలని కోరుకునేవాడు. అప్పటికే యుక్తవయసుకు వచ్చిన కుమారుడు సైతం తన తండ్రి కళాకారుడిగా ఎదగాలని ఆకాంక్షించాడు. ఈ క్రమంలో తండ్రి కాలధర్మం చెందగా.. కుమారుడు, కుమార్తెను ప్రయోజికులను చేసి.. వారి వివాహాలు పూర్తి చేశాడు. ఇప్పుడు కళాకారుడు కావాలన్న తన ఆకాంక్షను బయటపెట్టడంతో కుటుంబసభ్యులు సహృదయంతో సమ్మతించారు.
దీంతో ఎంతో ఆనందంతో సినిమారంగం వైపు అడుగులేస్తున్నారు నంద్యాల శ్రీను. సాత్విక, ప్రతినాయక ఛాయలున్న పాత్రలు పోషించడమంటే నాకు చాలా ఇష్టమని శ్రీను చెబుతున్నారు. ఆదిశగానే సినిమా రంగంలో ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు. నా ఈ ప్రయత్నానికి భార్య, పిల్లలతో పాటు కుటుంబసభ్యులు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిదని చెబుతున్నారు. రైతుగా, బాధ్యతాయుతమైన కుమారుడిగా, తండ్రిగా, భర్తగా అన్ని బాధ్యతలు మోశానని.. కళాకారుడిగా తనకు ఒక అవకాశం కల్పించాలని సినీ ప్రముఖులకు విన్నవిస్తున్నాడు. తనను సినిమా రంగంలో ప్రోత్సహించాలనుకున్న వారు 9618850417 నంబర్ లో సంప్రదించాలని నంద్యాల శ్రీను కోరుతున్నాడు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Acting and agriculture is the passion of this farmer
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com