Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi-Mahesh Babu: షాకింగ్ : బాధపడుతూ మెసేజ్ లు చేసిన మహేష్...

Chiranjeevi-Mahesh Babu: షాకింగ్ : బాధపడుతూ మెసేజ్ లు చేసిన మహేష్ – చిరంజీవి !

Chiranjeevi-Mahesh Babu: దిగ్గజ నిర్మాత, తెలుగు సినీ లోకంలో నేటి పితామహుడు ‘నారాయణ్ దాస్ కె నారంగ్’ గారు గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ నేడు మృతి చెందడం అందర్నీ కలిచి వేసింది. టాలీవుడ్ కి ఎనలేని సేవలను అందించిన నారాయణ దా కె నారంగ్‌ మృతిపట్ల తెలుగు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలుపుతున్నారు.

Chiranjeevi-Mahesh Babu
Chiranjeevi-Mahesh Babu

ఈ క్రమంలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ నారాయణ్ దాస్ మృతిపట్ల మెగాస్టార్‌ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు. నారాయణ్ దాస్ గారి గురించి చిరంజీవి మాటల్లోనే..

Also Read: Pavan Kalyan Movie Title: పవన్ కళ్యాణ్ మూవీ టైటిల్ తో విజయ్ దేవరకొండ సినిమా

‘ప్రదర్శనారంగంలో నిష్ణాతుడు, మాట మీద నిలబడే నిఖార్సైన మనిషి, నిబద్ధత కలిగిన వ్యక్తి, అపార అనుభవజ్ఞుడు, సినీరంగంలో ఒక మహారథి, ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షులు శ్రీ నారాయణదాస్ నారంగ్ గారికి శ్రద్ధాంజలి’ అని చిరంజీవి ఎమోషనల్ అవుతూ ట్వీట్‌ చేశారు.

నారాయణ్‌ దాస్‌ గారితో మహేష్ బాబుకి కూడా ప్రత్యేక అనుబంధం ఉంది. అందుకే, ఆయన మరణం పట్ల మహేష్ కూడా ఎమోషనల్ అయ్యారు. మహేష్ సంతాపం వ్యక్తం చేస్తూ.. ‘నారాయణ్‌ దాస్‌ గారు ఇక లేరనే వార్త విని నేను చాలా దిగ్భ్రాంతికి గురి అయ్యాను.

Narayanadas K Narang
Narayanadas K Narang

టాలీవుడ్ నేడు ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయింది. నారాయణ్‌ దాస్‌ గారి కుటుంబ సభ్యులను సానుభూతి తెలియజేస్తున్నాను. నారయణ్‌ దాస్‌ గారి లాంటి పెద్ద మనిషితో కలిసి పనిచేసే అవకాశం నాకు దక్కడం నా అదృష్టంగా భావిస్తున్నాను’ అని మహేష్ ట్వీట్‌ చేశాడు.

అలాగే, పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, సుధీర్‌బాబు, సుషాంత్‌, శివకార్తికేయతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా నారయణ్‌ దాస్‌ గారి మృతి పట్ల ట్విటర్‌ వేదికగా నివాళులు అర్పిస్తూ ఎమోషనల్ మెసేజ్ లు పోస్ట్ చేశారు.

నారాయణ్ దాస్ గారు ప్రస్తుతం నాగార్జునతో ‘ఘోస్ట్‌’, అలాగే ధనుష్‌తో ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Recommended Videos:

Revanth Reddy vs CM KCR || Special Story on Prashant Kishor Focus in Telangana Politics || Ok Telugu

Prabhas Salaar Photo Leaked | Salaar Leaked Scenes | Salaar Movie Updates | Oktelugu Entertainment

Ranbir Kapoor vs Alia Bhatt || Ranbir Kapoor Net Worth 2022 || Oktelugu Entertainment

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Exit mobile version