https://oktelugu.com/

Electric Vehicles : విద్యుత్తు వాహనాల మార్కెటుని గుప్పెట్లో పెట్టుకున్న చైనా

ప్రపంచంలో విద్యుత్ వాహనాల మార్కెట్ మొత్తం చైనా చేతుల్లోనే ఉంది. ఇప్పుడిప్పుడే ఇండియాలో విస్తరిస్తోంది. అయినా కూడా ఇప్పటికీ మార్కెట్ ను గుప్పెట్లో పెట్టుకుంది చైనా దేశం..

Written By:
  • NARESH
  • , Updated On : May 5, 2023 11:33 pm
    Follow us on

    Electric Vehicles : దేశంలో పెట్రో ధరలు పెరుగుతున్నాయి. సామాన్యుడిపై ప్రభావం పడుతూనే ఉంది. పెరుగుతున్న ధరలతో ఏం చేయలేని పరిస్థితి. దీంతో పెట్రో భారాన్ని తగ్గించుకోవాలని ప్రతి ఒక్కరు ప్రణాళికలు రచిస్తుంటారు. కానీ కుదరడం లేదు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈవీలతో పెట్రో సమస్యలు ఉండవు. చార్జింగ్ పెట్టుకుంటే చాలు. ఎంత దూరమైనా ఎలాంటి డబ్బులు ఖర్చు కాకుండా వెళ్లొచ్చు. దీంతో పెట్రోల్ తో నడిచే వాహనాలతో ఖర్చు అధికమవుతోంది. జేబులు ఖాళీ అవుతున్నాయి. అందుకే ఎలక్ర్టిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. డబ్బును ఆదా చేసుకోవాలని భావిస్తున్నారు.

    ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయడానికి ప్రభుత్వాలు సైతం రాయితీలు ఇస్తున్నాయి. దీంతో వినియోగదారులు కూడా వీటిని కొనుగోలు చేయడానికి శ్రద్ధ చూపిస్తున్నారు. భవిష్యత్ లో ఎలక్ట్రిక్ కార్లు కూడా రాబోతున్నాయి. పెట్రోల్ సమస్యతో ఎలక్ట్రిక్ వాహనాల గిరాకీ పెరుగుతోంది. వాహనాల కొనుగోలుపై కేవలం ఐదు శాతం జీఎస్టీ పడుతోంది. ఈ నేపథ్యంలో ఈవీల కొనుగోలుకు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. పెట్రోల్ ఖర్చు లేకపోవడంతో ఎటు వెళ్లాలన్నా డబ్బుల సమస్య మాత్రం ఉండదు.

    అయితే ఇప్పటికీ ప్రపంచంలో విద్యుత్ వాహనాల మార్కెట్ మొత్తం చైనా చేతుల్లోనే ఉంది. ఇప్పుడిప్పుడే ఇండియాలో విస్తరిస్తోంది. అయినా కూడా ఇప్పటికీ మార్కెట్ ను గుప్పెట్లో పెట్టుకుంది చైనా దేశం..

    విద్యుత్ వాహనాల మార్కెట్ పై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింద వీడియోలో చూడొచ్చు.

    విద్యుత్తు వాహనాల మార్కెటుని గుప్పెట్లో పెట్టుకున్న చైనా || Electric Vehicles || China || Ram Talk