https://oktelugu.com/

Ramabanam Collections: ‘రామబాణం’ మొదటి రోజు వసూళ్లు.. డిజాస్టర్ రేటింగ్స్ తో అదిరిపోయే రేంజ్ ఓపెనింగ్స్

ఆన్లైన్ లో ఉన్న రేంజ్ లో నెగటివ్ టాక్ , బయట లేకపోవడం కూడా ఈ సినిమాకి డీసెంట్ ఓపెనింగ్ రావడానికి కారణం అయ్యింది. మార్నింగ్ షోస్ కంటే మ్యాట్నీ నుండి చాలా చోట్ల వసూళ్లు పుంజుకున్నాయి.

Written By:
  • Vicky
  • , Updated On : May 6, 2023 7:25 am
    Ramabanam Collections

    Ramabanam Collections

    Follow us on

    Ramabanam Collections: మ్యాచో స్టార్ గోపీచంద్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘రామబాణం’ నిన్న గ్రాండ్ గా విడుదలై ఆన్లైన్ లో డిజాస్టర్ రేటింగ్స్ ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. రొటీన్ కమర్షియల్ సినిమా అంటూ , ఈ చిత్రానికి నెగటివ్ టాక్ ఆన్లైన్ లో బాగా వ్యాప్తి చెందింది. కానీ కమర్షియల్ మూవీ అవ్వడం, గోపీచంద్ కి మాస్ లో మంచి ఇమేజి ఉండడం వల్ల ఈ చిత్రానికి మాస్ సెంటర్స్ లో డీసెంట్ స్థాయి ఓపెనింగ్ దక్కింది.

    ఆన్లైన్ లో ఉన్న రేంజ్ లో నెగటివ్ టాక్ , బయట లేకపోవడం కూడా ఈ సినిమాకి డీసెంట్ ఓపెనింగ్ రావడానికి కారణం అయ్యింది. మార్నింగ్ షోస్ కంటే మ్యాట్నీ నుండి చాలా చోట్ల వసూళ్లు పుంజుకున్నాయి. ఇక ఫస్ట్ షోస్ నుండి ఇంకా మంచి వసూళ్లు నమోదు అయ్యాయి.దీనిని బట్టి చూస్తే ఈ చిత్రం ఫ్లాప్ అయితే అవ్వద్దు, కనీసం యావరేజి ఫలితం ని అయినా దక్కించుకుంటుంది అనే విషయం అర్థం అవుతుంది.

    ఇక మొదటి రోజు వసూళ్ల విషయానికి వస్తే ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి దాదాపుగా కోటి 70 లక్షల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించిందట, తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ ఓపెనింగ్ దక్కినప్పటికీ ఓవర్సీస్ లో మాత్రం డిజాస్టర్ ఓపెనింగ్ ని సొంతం చేసుకుంది ఈ చిత్రం. అలాగే కర్ణాటక మరియు తమిళనాడు వంటి ప్రాంతాలలో కూడా అంతంత మాత్రంగానే వసూళ్లను దక్కించుకుంది. అలా మొత్తం మీద ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించింది.

    ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 15 కోట్ల 20 లక్షల రూపాయిల వరకు జరిగింది. మొదటి రోజు వచ్చిన ఓపెనింగ్ కి బ్రేక్ ఈవెన్ టార్గెట్ చాలా పెద్దదే, మొదటి వీకెండ్ లో కేవలం ఆరు కోట్ల రూపాయిల షేర్ మాత్రమే రాబట్టే ఛాన్స్ ఉంది, బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే వీక్ డేస్ లో అద్భుతమైన వసూళ్లు రావాలి. చూడాలి మరి వీక్ డేస్ లో ఈ చిత్రం నిలబడుతుందా లేదా అనేది.