BRS Candidates List : బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ స్థానాల్లో మార్పులు.. ఇక్కడ కొత్త అభ్యర్థులు వీరే!

కానీ మీడియా అంచనాలను తలకిందులు చేసేలా ఒకేసారి 115 అభ్యర్థులను ప్రకటించారు.

Written By: NARESH, Updated On : August 21, 2023 3:41 pm
Follow us on

BRS Candidates List : అందరి అంచనాలను బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తలకిందులు చేశారు. ఎవరికీ అందకుండా ఏకంగా ఈసారి 115 స్థానాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు. తాను గజ్వేల్‌తోపాటు, కామారెడ్డి స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. తొమ్మిది చోట్ల అభ్యర్థులను గులాబీ బాస్‌ మార్చారు. నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. నర్సాపూర్, నాంపల్లి, గోషామహల్, జనగాం స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయలేదు. నిన్నటి వరకు 51 మంది జాబితా అని, 81 మంది అని, 105 మంది లిస్ట్‌ రెడీ అయిందని ప్రచారం జరిగింది. కానీ మీడియా అంచనాలను తలకిందులు చేసేలా ఒకేసారి 115 అభ్యర్థులను ప్రకటించారు.

అభ్యర్థులు మారిన స్థానాలు ఇవే..

కామారెడ్డి – కేసీఆర్‌

ఉప్పల్‌ – బండారు లక్ష్మారెడ్డి

వేములవాడ – చల్మెడ లక్ష్మీనరసింహారావు

ఖానాపూర్‌ – భూక్యా జాన్సన్‌నాయక్‌
స్టేషన్‌ ఘన్‌పూర్‌ – కడియం శ్రీహరి

ఆసిఫాబాద్‌ – కోవ లక్ష్మి

వైరా – మదన్‌ లాల్‌

బోథ్‌ – అనిల్‌ జాదవ్‌

కోరుట్ల – కల్వకుంట్ల సంజయ్‌