కొత్త ఏడాదిలో వాట్సాప్ తెచ్చిన ప్రైవసీ పాలసీ ఆ యాప్ కు కొత్త సమస్యలను సృష్టించడంతో పాటు వాట్సాప్ యూజర్లలో ఆ యాప్ పై కొంత నెగటివిటీని పెంచిన సంగతి తెలిసిందే. అయితే యూజర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీని యాక్సెప్ట్ చేయడానికి గడువును మరో మూడు వారాల పాటు పొడిగించింది. ఫిబ్రవరి 8వ తేదీ నుంచి మే 15 వరకు గడువు పొడిగించినా వాట్సాప్ యూజర్లు మాత్రం కొత్త ప్రైవసీ పాలసీని వాట్సాప్ వెనక్కు తీసుకోవాలని కోరుతున్నారు.
Also Read: ఎల్‌ఐసీ పాలసీ.. రోజుకు రూ.121 ఆదాతో రూ.27 లక్షలు..?
అయితే కొందరు నెటిజన్లు మాత్రం ప్రైవసీ పాలసీని యాక్సెప్ట్ చేయకపోతే వాట్సాప్ అకౌంట్ ను సెక్యూర్ గా ఉంచుకోలేమా..? అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే సెట్టింగ్స్ లో కీలక మార్పులు చేసుకోవడం ద్వారా వాట్సాప్ అకౌంట్ ను సులభంగా సెక్యూర్ చేసుకోవచ్చు. వాట్సాప్ యూజర్లు వాట్సాప్ అకౌంట్ ను రెగ్యులర్ గా అప్ డేట్ చేసుకుంటే సెక్యూరిటీ ఫీచర్లు యాడ్ కావడంతో పాటు వాట్సాప్ పర్ఫామెన్స్ ఇంప్రూవ్ అవుతుంది.
Also Read: ఆధార్ కార్డులో పెళ్లి భోజనాల లిస్ట్.. అసలేం జరిగిందంటే..?
లాస్ట్ సీన్, ప్రొఫైల్ ఫోటో, స్టేటస్ లను ఎవరు చూడాలో అందుకు తగిన విధంగా సెట్టింగ్స్ లో మార్పులు చేసుకునే ఆప్షన్లు వాట్సాప్ లో ఉన్నాయి. ఇతరులు మన నంబర్ ను మన అనుమతి లేకుండా వాట్సాప్ గ్రూపులలో యాడ్ చేయకుండా చేయవచ్చు. సెట్టింగ్స్ లోకి వెళ్లి ట్యాప్ అకౌంట్ ఆప్షన్ ను ఎంపిక చేసుకుని ప్రైవసీలోకి వెళ్లి గ్రూప్స్ అనే ఆప్షన్ ను ఎంచుకుని గ్రూప్ సెట్టింగ్స్ లో మార్పులు చేసుకోవచ్చు.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
ఫింగర్ ప్రింట్ ఐడీ సహాయంతో మన ఫోన్ ఇతరులు తీసుకున్నా వాళ్లు వాట్సాప్ ఓపెన్ చేయలేని విధంగా సెట్టింగ్స్ లో మార్పులు చేయవచ్చు. వాట్సాప్ యాప్ లో యూజర్లు టూ స్టెప్ వెరిఫికేషన్ ను ఎప్పుడూ ఆన్ లో ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇతరులు ఫోన్ ను ఎట్టి పరిస్థితుల్లో యాక్సెస్ చేయలేరు. డిజప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్ సహాయంతో వాట్సాప్ చాట్ చాటింగ్ చేసిన ఏడు రోజులకు డిలేట్ అయ్యే విధంగా కూడా సెట్టింగ్స్ లో మార్పులు చేసుకోవచ్చు.