https://oktelugu.com/

విజయసాయిరెడ్డి చేసిన పనికి వెంకయ్యనాయుడు ఏం చేశాడంటే?

వైసీపీలో ఇప్పుడు జగన్ తర్వాత ఎవరైనా ఉన్నారంటే అది విజయసాయిరెడ్డినే. ఇప్పుడు ఢిల్లీలో, ఏపీ గల్లీలో వైసీపీ వ్యవహారాలన్నీ ఆయనే చూస్తారు.  వైసీపీ కీలకనేత, పార్లమెంటు సభ్యుడు విజయసాయిరెడ్డి రాజకీయాల్లో చాలా చురుగ్గా వ్యవహరిస్తుంటారు. అపర చాణక్యుడిగా పిలుచుకునే ఆయనంటే.. వైసీపీలో తిరుగులేదు.. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం అనంతరం జగన్ మోహన్ రెడ్డికి వెన్నంటే ఉన్న వ్యక్తి విజయసాయి రెడ్డి. వైసీపీ పార్టీలో సీఎం తరువాత అన్ని వ్యవహారాలు చూసుకునే నేతగా పేరు సంపాదించారు. ఇంతటి […]

Written By:
  • NARESH
  • , Updated On : February 4, 2021 / 07:19 PM IST
    Follow us on

    వైసీపీలో ఇప్పుడు జగన్ తర్వాత ఎవరైనా ఉన్నారంటే అది విజయసాయిరెడ్డినే. ఇప్పుడు ఢిల్లీలో, ఏపీ గల్లీలో వైసీపీ వ్యవహారాలన్నీ ఆయనే చూస్తారు.  వైసీపీ కీలకనేత, పార్లమెంటు సభ్యుడు విజయసాయిరెడ్డి రాజకీయాల్లో చాలా చురుగ్గా వ్యవహరిస్తుంటారు. అపర చాణక్యుడిగా పిలుచుకునే ఆయనంటే.. వైసీపీలో తిరుగులేదు.. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం అనంతరం జగన్ మోహన్ రెడ్డికి వెన్నంటే ఉన్న వ్యక్తి విజయసాయి రెడ్డి. వైసీపీ పార్టీలో సీఎం తరువాత అన్ని వ్యవహారాలు చూసుకునే నేతగా పేరు సంపాదించారు. ఇంతటి చురుకైన వ్యక్తిని ఉప రాష్ట్రపతి ప్రత్యేకంగా గుర్తించారు. విజయసాయి రెడ్డిని పొగుడుతూ.. వెంకయ్య వ్యాఖ్యానించడం.. ఇప్పడు వైసీపీ సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యింది. తనను.. తన పనితీరును ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పొగిడారని విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా వివరించారు.

    అయితే విజయసాయిరెడ్డిని వెంకయ్య నాయుడు పొగిడింది ఆయన ట్విట్లను చూసి అని అంతా అనుకున్నారు.. కానీ ఆయన పనితీరును చూసి అని పార్టీ నాయకులు అంటున్నారు. విజయసాయిరెడ్డి కామర్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు. సాధారణంగా స్టాండింగ్ కమిటీలు అంత యాక్టివ్ గా ఉండవు. చైర్మన్లు చొరవ తీసుకుంటేనే సమావేశాలు జరుగుతాయి. ఈ విషయంలో ఎంత బిజీగా ఉన్నా.. విజయసాయి రెడ్డి సీరియస్ గా పని చేశారు.

    2019.. 2020 లో పదిహేను సార్లు విజయసాయిరెడ్డి చైర్మన్ గా ఉన్న కామర్స్ స్టాండింగ్ కమిటీ సమావేశం అయ్యింది. కోవిడ్ ఉన్నా.. ఆ ఏడాదిలోనూ.. 10 సార్లు కమిటీ సమావేశం జరిగింది. కరోనా కారణంగా గత ఏడాది ఏప్రిల్ జూలై మధ్య నాలుగు నెలల పాటు అనేక పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. కానీ విజయసాయిరెడ్డి మాత్రం సమావేశాలు నిర్వహించారు.

    విజయసాయిరెడ్డి నేతృత్వంలోని కమిటీ అత్యధికంగా ఐదుసార్లు ప్రభుత్వానికి నివేదికలు సమర్పించింది. దీంతో కామర్స్ స్టాండింగ్ కమిటీ పనితీరుపై రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసల జల్లు కురిపించారు. విజయసాయిరెడ్డి నేతృత్వంలోని పార్లమెంటరీ సంఘం కామర్స్ స్టాండింగ్ కమిటీ ఏడాది కాలంలో అత్యుత్తమ పనితీరును ప్రదర్శించినట్లు వెంకయ్య నాయుడు ప్రకటించారు. విజయసాయిరెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. దీనికి విజయసాయిరెడ్డి మురిసిపోయారు. ఎంత రాజకీయ నేత అయినా.. పనితీరుకు ప్రశంసలు వస్తే.. అది ప్రత్యర్థి ఇచ్చినా.. ఇష్టంలేని వారు ఇచ్చినా.. పాజిటివ్ గా తీసుకుంటారు. అందుకు విజయసాయి రెడ్డి కూడా అతీతుడు కాదు.