BRS TRS : తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నట్టే జాతీయ అడుగులు వేశారు. తన ప్రాంతీయ టీఆర్ఎస్ పార్టీనే జాతీయ పార్టీగా మార్పుతూ తీర్మానించారు. ఈ మేరకు టీఆర్ఎస్ పార్టీ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుతున్న టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ కేకే పేరుపై ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు.

కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనతో జోష్ నెలకొంది. తెలంగాణ భవన్ బయట పటాకులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. టీఆర్ఎస్ లో జోష్ నెలకొంది.
ఇక సాయంత్రం 4 గంటలకు కేసీఆర్ తన జాతీయ పార్టీపై విధివిధానాలను ప్రకటించనున్నారు. ఇక బీఆర్ఎస్ జెండా అచ్చం తెలంగాణ రాష్ట్రసమితి జెండాను పోలి ఉండనుంది. తెలంగాణలోని 33 జిల్లాలతో ఉండే టీఆర్ఎస్ జెండా ప్లేసులో భారత దేశ పటం రాష్ట్రాలు ఉండనున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితికి, బీఆర్ఎస్ కు మధ్యలో పటాల మార్పు మాత్రమే ఉండనుంది.
ఇక రంగు గులాబీనే ఎంచుకోగా.. గుర్తును ఎన్నికల కమిషన్ అభ్యంతరాలు లేకుంటే ‘కారు’నే కేటాయించనున్నారు. ఇక ఎంపీ వినోద్, సహా టీఆర్ఎస్ లీగల్ టీం ఈరోజు ఎన్నికల కమిషన్ ను కలిసి జాతీయ పార్టీ పేరు మార్పుపై ఈసీకి అందజేయనున్నారు.