Chandramukhi 2 First Review: చంద్రముఖి 2 ఫస్ట్ రివ్యూ… రజినీని లారెన్స్ అందుకున్నాడా?

ఒక ట్రెండ్ సెట్టింగ్ మూవీ సీక్వెల్ పై జనాల్లో ఆసక్తి ఉంది. సెప్టెంబర్ 28న చంద్రముఖి 2 వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నారు. అయితే చంద్రముఖి 2 ప్రీమియర్స్ చూసిన ప్రముఖులు చిత్రం పట్ల తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు.

Written By: Shiva, Updated On : September 27, 2023 8:23 am

Chandramukhi 2 Collections

Follow us on

Chandramukhi 2 First Review: కొన్ని సబ్జక్ట్స్ టచ్ చేయాలంటే గట్స్ ఉండాలి. బెంచ్ మార్క్ సెట్ చేసిన సినిమాకు సీక్వెల్, రీమేక్ చేయడం కత్తిమీద సామే. చంద్రముఖి సినిమా అలాంటిదే. దీనికి సీక్వెల్ గా వెంకటేష్ చేసిన నాగవల్లి డిజాస్టర్. చంద్రముఖి సినిమాలో రజినీకాంత్, జ్యోతికల నటన నభూతో న భవిష్యతి. హీరో రాఘవా లారెన్స్ చంద్రముఖి 2 ప్రకటించి సంచలనాలకు తెరలేపాడు. రజినీకాంత్ పాత్ర ఆయన చేస్తుండగా… జ్యోతిక పాత్ర కంగనా రనౌత్ చేస్తుంది. ఒరిజినల్ తెరకెక్కించిన సీనియర్ దర్శకుడు పి. వాసు డైరెక్ట్ చేశాడు.

ఒక ట్రెండ్ సెట్టింగ్ మూవీ సీక్వెల్ పై జనాల్లో ఆసక్తి ఉంది. సెప్టెంబర్ 28న చంద్రముఖి 2 వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నారు. అయితే చంద్రముఖి 2 ప్రీమియర్స్ చూసిన ప్రముఖులు చిత్రం పట్ల తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో టాక్ బయటకు వచ్చింది. అందుతున్న సమాచారం ప్రకారం చంద్రముఖి 2 కి పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. దర్శకుడు పి. వాసు స్క్రీన్ ప్లే సినిమాకు ప్లస్ అంటున్నారు.

ఆయన కథను నడిపించిన తీరు ఆకట్టుకుందని అంటున్నారు. హీరో రాఘవ లారెన్స్ రెండు భిన్నమైన పాత్రల్లో మెప్పించాడు. రజినీకాంత్ ని అనుకరించకుండా తన మార్క్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే రజినీకాంత్ తో పోల్చుకుంటే ఆయన నటన తేలిపోయిందని అంటున్నారు. ఇక చంద్రముఖిగా కంగనా రనౌత్ కి ఆడియన్స్ పాస్ మార్క్స్ వేస్తున్నారు. అప్పట్లో జ్యోతిక ప్రేక్షకులను మామూలుగా బయపెట్టలేదు. సినిమా చూసిన జనాలు నిద్రలో కేకలు వేశారు. ఆ స్థాయిలో కంగనా భయపెట్టలేకపోయింది.

రాధిక, వడివేలు వంటి స్టార్ క్యాస్ట్ సినిమాకు ప్లస్ అయ్యారని అంటున్నారు. చాలా కాలం తర్వాత కీరవాణి ఓ తమిళ చిత్రానికి పని చేశారు. చంద్రముఖి 2 చిత్రానికి కీరవాణి మ్యూజిక్ బలం చేకూర్చింది అంటున్నారు. మొత్తంగా చెప్పాలంటే ఒరిజినల్ స్థాయిలో చంద్రముఖి 2 ఉండదు. పోలికలతో చూస్తే సినిమా పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయలేము. ఇది రాఘవ లారెన్స్, కంగనా వర్షన్ ఆఫ్ చంద్రముఖి. కాబట్టి అదే స్థాయిలో అంచనాలు పెట్టుకుని సినిమాకు వెళితే ఎంజాయ్ చేస్తారు. ఇది చంద్రముఖి 2 సినిమా గురించి వినిపిస్తున్న ఫస్ట్ టాక్…