Homeబిజినెస్Mistake Product : అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో రాంగ్ ప్రొడక్ట్ వచ్చిందా.. అయితే ఇలా చేయండి!

Mistake Product : అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో రాంగ్ ప్రొడక్ట్ వచ్చిందా.. అయితే ఇలా చేయండి!

Mistake Product: పండుగల సమయంలో ప్రజలంతా షాపింగ్‌ చేయడంలో బిజీగా ఉంటారు. బట్టల నుంచి ఇంటికి కావాల్సిన అన్ని రకాల వస్తువులను కాస్త ఖర్చు అయినా సీజన్ కాబట్టి కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆన్‌లైన్ వ్యాపారం చాలా వేగంగా విస్తరించింది. ఈ క్రమంలోనే అనేక ఇ కామర్స్ సంస్థలు పుట్టుకొచ్చాయి. వివిధ ఇ-కామర్స్ కంపెనీలు అనేక డిస్కౌంట్లతో వివిధ ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి. మార్కెట్ ధరతో పోలిస్తే తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. ప్రజలు కూడా భారీగా కొనుగోలు చేస్తున్నారు. దీనికి కారణం మీరు మీ ఇంటి నుండి బయటకు రాకుండా మీకు కావాల్సిన అన్ని వస్తువులను కొనుగోలు చేయవచ్చు. అలాగే షాపుల్లో లభించే వస్తువుల కంటే సరికొత్త మోడల్స్ ఆన్‌లైన్ షాపింగ్‌లో అందుబాటులో ఉంటాయి. అయితే ఆన్‌లైన్‌లో షాపింగ్ ఎంత ఈజీగా ఉంటుందో అంటే ప్రమాదకరం అన్న విషయాన్ని మాత్రం గుర్తు పెట్టుకోవాలి. అజాగ్రత్తగా ఉంటే మోసపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024లు షురూ అయ్యాయి. మీరు ఆన్‌లైన్ షాపింగ్‌ ఇష్టపడితే, అమ్మకంలో మీరు చేసిన డెలివరీ సమయంలో రాకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు గనుక తప్పుడు ప్రోడక్ట్‌ డెలివరీ అయినట్లయితే ఆ వస్తువును తిరిగి ఇవ్వడానికి, లేదా మీ డబ్బును వాపసు పొందడానికి మీరు గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు కింద పేర్కొన్నాము. అంతే కాకుండా సదరు సంస్థకు మీరు మీ ఫిర్యాదును ఎలా ఫైల్ చేయవచ్చో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇలా ఫిర్యాదు చేయవచ్చు ..
మీరు అమెజాన్ లేదా ఫ్లిప్ కార్టు లేదా మీషో నుండి ఒక వస్తువును ఆర్డర్ చేసినప్పుడు, ఆ వస్తువు ను రిటన్‌ చేసేందుకు ఎన్ని రోజుల సమయం ఉందో వెబ్ సైట్లో ఖచ్చితంగా తెలుసుకోండి. మీరు రీప్లేస్‌మెంట్‌తో వచ్చే వస్తువును ఆర్డర్ చేసినట్లయితే, ఈ సందర్భంలో మీ డబ్బును వాపసు పొందే అవకాశం ఉండదు. కానీ మీ ఉత్పత్తి ఏడు లేదా పది రోజుల రీప్లేస్‌మెంట్ గ్యారెంటీతో వచ్చినట్లయితే, మీరు ఆ వస్తువును తిరిగి ఇచ్చేయవచ్చు.

వస్తువును తిరిగి ఇచ్చిన తర్వాత మీరు నగదు వాపసు పొందుతారు. వస్తువును తిరిగి ఇవ్వడానికి ఆర్డర్ విభాగానికి వెళ్లి రిటర్న్ అభ్యర్థనను సమర్పించండి. రిటర్న్ అభ్యర్థన సమర్పించకపోతే కస్టమర్ కేర్‌ను సంప్రదించి మీకు ఎదురైన సమస్యలను వివరించవచ్చు.

కస్టమర్ ఫోరమ్‌కు ఎలా ఫిర్యాదు చేయాలి?
మీరు ఫిర్యాదు చేసిన తర్వాత మీకు కస్టమర్ కేర్ నుండి ఎటువంటి ప్రతిస్పందన రాకుంటే, మీరు వినియోగదారుల రక్షణ చట్టం కింద సహాయం తీసుకోవచ్చు. మీరు కస్టమర్ ఫోరమ్‌లో కంపెనీకి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయవచ్చు. మీరు నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ నంబర్‌లకు 1800-11-4000, 1915కి కాల్ చేయడం ద్వారా మీ ఫిర్యాదును నమోదు చేసుకోవచ్చు.

బిల్లు, వారంటీ లేదా హామీ పత్రాల కాపీ మొదలైనవి కూడా ఫిర్యాదుతో జతచేయాలి. మీరు ఈ లింక్ https://consumerhelpline.gov.in/user/ ద్వారా వినియోగదారుల వ్యవహారాల విభాగానికి కూడా ఫిర్యాదు చేయవచ్చు.

Mahi
Mahihttp://oktelugu.com
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular