
YCP vs TDP : 23.. 23.. 23.. గత నాలుగేళ్లుగా తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబును తీవ్ర మానసిక
క్షోభకు గురి చేసిన సంఖ్య ఇది. ఏ 23 సంఖ్య అయితే తెలుగుదేశం పార్టీకి అచ్చదన్న భావనను వైసిపి తీసుకెల్లిందో.. ఇప్పుడు అదే 23 నెంబర్ తో వైసీపీకి తెలుగుదేశం పార్టీ ఝలక్ ఇచ్చి లెక్క సరి చేసింది. అసలు ఆ 23 నెంబర్ తో ఉన్న లింక్ ఏంటో ఒకసారి చూసేద్దాం.
గత నాలుగేళ్లుగా వైసిపి అగ్ర నాయకులతోపాటు క్షేత్రస్థాయిలోని కార్యకర్తల వరకు 23 నెంబర్ తో తెలుగుదేశం పార్టీని ఒక ఆట ఆడేసుకుంటున్నారు. అదేంటో గాని ఆ నెంబర్ తెలుగుదేశం పార్టీకి అచ్చిరానట్టుగా గత నాలుగేళ్లుగా అనేక సందర్భాల్లో ఆ పార్టీకి పరిస్థితులు ఎదురవుతూ వచ్చాయి. సరిగ్గా నాలుగేళ్ల తర్వాత అదే 23 నెంబర్ తో తెలుగుదేశం పార్టీ లెక్క సరి చేసింది. దీంతో, ఆమెకు కలిసి రాదు అనుకున్న నెంబర్ ను కలిసి వచ్చేలా చేసుకున్నామని, రానున్న సార్వత్రిక ఎన్నికలకు ఇదే స్పీడ్ తో వెళ్లి విజయం సాధిస్తామని తెలుగుదేశం పార్టీ ధీమాను వ్యక్తం చేస్తోంది.
23 తీసుకున్నారు.. 23 మిగిలాయి..
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నుంచి గెలిచిన 23 మంది శాసనసభ్యులను తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు చేర్చుకున్నారు. వీరిలో నలుగురు శాసనసభ్యులకు చంద్రబాబు నాయుడు మంత్రి పదవులను కట్టబెట్టారు. అనంతరం జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుని అదే 23 ఎమ్మెల్యేలకు పరిమితమైంది. నాటి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కూడా మే 23వ తేదీన వచ్చాయి. ఫలితాలు వైసీపీకి అనుకూలంగా రావడంతో నాటి నుంచి చంద్రబాబు లక్ష్యంగా 23 కేంద్రంగా అధికార పార్టీ విమర్శలు గుప్పిస్తూ వచ్చింది. 23 మంది ఎమ్మెల్యేలను తీసుకున్న చంద్రబాబుకు.. 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారని, 23వ తేదీన ఫలితాలు రావడం.. దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటూ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు.
23 నెంబర్ పగబట్టిందా అన్నంతగా..
ఈ ఫలితాలతో 23 నెంబర్ పగబట్టిందా అన్నంతగా చంద్రబాబు పరిస్థితి మారిపోయింది. ఒకానొక దశలో 23 నెంబర్ వచ్చేట్టు ఏదైనా ఉంటే అది తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉంటుందన్న భావన ఆ పార్టీ క్యాడర్ లోను బలంగా చొచ్చుకు పోయింది. అంత బలంగా చంద్రబాబు పగబెట్టిన ఈ నెంబర్ తో కూడిన తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలు జరగడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఒకింత ఆందోళన నెలకొంది. ఏప్రిల్ 23వ తేదీ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయని తెలిసి.. చాలా మంది ఆశలు వదులుకున్నారు.
అదృష్ట సంఖ్యగా మార్చిన చంద్రబాబు..
ఏ 23 నెంబర్ అయితే తనపై పగ పట్టినంతగా వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయి.. అదే నెంబర్ ఉన్న తేదీన సానుకూల ఫలితాలు వచ్చేలా చేసి చంద్రబాబుకు ఆ నెంబర్ అంటే పడదు అనే మచ్చను తొలగించుకున్నారు. తాజాగా ఏప్రిల్ 23వ తేదీన దిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడంతోపాటు.. 23 ఓట్లు సాధించడం ద్వారా తనకు కలిసి రాదన్న నెంబర్ కలిసి వచ్చేలా చంద్రబాబు చేసుకున్నట్లయింది.
23 నెంబర్ కు 23 నెంబర్ తో చెక్..
వైసిపి ఏ 23 నెంబర్తో అయితే తనను విమర్శలు చేస్తుందో.. అదే 23 నెంబర్ వైసీపీ నాయకులకు మింగుడు పడని విధంగా దేవుడు రిటర్న్ స్క్రిప్ట్ గిఫ్ట్ గా ఇచ్చాడని టిడిపి నాయకులు వైసీపీ పై విమర్శలు చేస్తున్నారు. ఏది ఏమైనా 23 నెంబర్ కీలకంగా మారడం గమనార్హం.