Balakrishna vs Jr NTR : చంద్రబాబు అరెస్ట్ : స్పందించని జూ.ఎన్టీఆర్ పై బాలయ్య హాట్ కామెంట్స్

అక్కడ మేము పోరాటం చేస్తాం అన్నిటికీ సమాధానం న్యాయస్థానమే చెబుతుంది అని బాలయ్య బాబు పవర్ ఫుల్ డైలాగులు చెప్పారు.

Written By: Gopi, Updated On : October 4, 2023 9:47 pm

chandrababu balakrishna jr ntr

Follow us on

Balakrishna vs Jr NTR : నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమాల్లో చాలా పవర్ ఫుల్ డైలాగులు చెబుతూ ప్రేక్షకులు అందరిచేత విజిల్స్ వేయిస్తాడు. అలాగే నిజ జీవితంలో కూడా ఆయన ఏదైనా అంశం మీద మాట్లాడాలంటే చాలా ఘాటుగా రియాక్ట్ అవుతూ ఉంటాడు. ఇక రీసెంట్ గా మాజీ సీఎం అయినా చంద్రబాబు నాయుడు ని అరెస్టు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆయన అరెస్ట్ ని నిరసించి చాలామంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీద ఘాటైన వ్యాఖ్యలు చేశారు.ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ తెలంగాణలో ఎలక్షన్స్ వస్తున్న సమయంలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో బాలకృష్ణ తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ఒక మీటింగ్ లో పాల్గొన్నారు.

అందులో బాలయ్య చాలా ఘాటు వ్యాఖ్యలు చేస్తూ మాట్లాడడం విశేషం తెలంగాణలో ఎలక్షన్స్ వస్తున్నందు వల్ల 2,3 రోజుల నుంచి మా నాన్న నందమూరి తారక రామారావు గారి పేరును బాగా వాడుకుంటూ కొంతమంది మాట్లాడుతున్నారు వాటన్నింటినీ మేము గమనిస్తూనే ఉన్నాం… తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేదు అని అంటున్నారు ఇప్పుడు మేము తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ తరుపున బరిలోకి దిగబోతున్నాం అని చెప్తున్నా… అలాగే తెలంగాణలో ఇప్పటివరకు తెలుగు దేశం పార్టీ పని అయిపోయింది అనుకుంటున్నారు కానీ తెలుగుదేశం పార్టీని భారీ స్థాయిలో గెలిపించుకునే విధంగా సన్నాహాలు చేస్తున్నాం అంటూ మాట్లాడారు. ఇక దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్ మాజీ సి ఎం చంద్రబాబు నాయుడు గారి అరెస్టును నిరసిస్తూ కూడా బాలయ్య జగన్ ప్రభుత్వం పైన మాట్లాడుతూ ఆంధ్రాలో ఒక సైకో పాలన నడుస్తుంది దానివల్ల జనాలు నిత్యం భయాందోళనలో బతుకుతున్నారు.

వాళ్ల పార్టీకి వ్యతిరేకంగా ఏ ఒక్క చిన్న మాట మాట్లాడినా కూడా కేసులు పెట్టడం అక్రమంగా అరెస్టు చేయడం,వీటితో పాటు గా తెలుగుదేశం కార్యకర్తల పైన విపరీతమైన దాడులు చేస్తున్నారు. ఇక మాజీ ముఖ్యమంత్రి అయిన బాబు గారిని కనీసం 17a సెక్షన్ అమలు చేయకుండా అక్రమ కేసులు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేశారు.వాళ్లు కేసులు పెట్టినంత మాత్రాన బాబు గారు తప్పు చేసినట్టు కాదు వాస్తవాలు ఎంటి అనేది న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. అక్కడ మేము పోరాటం చేస్తాం అన్నిటికీ సమాధానం న్యాయస్థానమే చెబుతుంది అని బాలయ్య బాబు పవర్ ఫుల్ డైలాగులు చెప్పారు.

ఇక పొత్తుల వ్యవహారం మీద ఎలాంటి కార్యకలాపాలను చేపట్టాలి అనేది చంద్రబాబు నాయుడు గారే వివరంగా చెప్తారు అంటూ మాట్లాడుతూనే చంద్రబాబు నాయుడు అరెస్టు మీద ఎన్టీఆర్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అలాగే రోజా స్పందన పైన మనం మాట్లాడకుండా మౌనంగా ఉండటమే కరెక్ట్ అంటూ కూడా ఆయన రోజా గురించి కూడా మాట్లాడటం జరిగింది…