Chandrababu Quash Petition : హైకోర్టులోనూ చంద్రబాబుకు షాక్.. క్వాష్ పిటిషన్ కొట్టివేత

ఇప్పుడు హైకోర్టులో చుక్కెదురు కావడంతో తెలుగుదేశం పార్టీ నాయకత్వం తరువాత వ్యూహంఎలా ఉంటుందో చూడాలి మరి.

Written By: Dharma, Updated On : September 22, 2023 4:25 pm

chandrababu arrest

Follow us on

Chandrababu Quash Petition : చంద్రబాబుకు షాక్ మీద షాక్ తగులుతోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తన రిమాండ్ చట్ట విరుద్ధమని.. దానిని కొట్టివేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్ హైకోర్టు కొట్టి వేసింది. చంద్రబాబు పిటిషన్ డిస్మిస్ చేస్తున్నట్లుగా జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి ఏకవాక్యంతో తీర్పు వెల్లడించారు. ఈ నెల 19న పిటిషన్ పై వాయిదాలు జరిగిన సంగతి తెలిసిందే. చంద్రబాబు తరఫున హరీష్ సాల్వే తో పాటు సిద్ధార్థ లూథ్ర వాదించారు. సిఐడి తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. అయితే మూడు రోజులు పాటు తీర్పును రిజర్వ్ చేశారు.

చంద్రబాబుకు హైకోర్టులో ఊరట లభించలేదు. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అత్యున్నత న్యాయస్థానంలో క్వాష్ పిటిషన్ దాఖలు చేసే ఛాన్స్ ఉంది. అసలు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కేసులో అవినీతి లేదని.. తనకు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం లేకపోయినా చట్ట విరుద్ధంగా అరెస్టు చేశారని చంద్రబాబు వాదిస్తున్నారు. అరెస్ట్ కు ముందు గవర్నర్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉన్నా తీసుకోలేదని.. గవర్నర్ అనుమతితోనే దర్యాప్తు చేయాల్సి ఉన్నా పట్టించుకోలేదన్నారు. అయితే ఆ చట్టం చేయడానికి ముందే నేరం జరిగిందని సిఐడి న్యాయవాదులు వాదనలు వినిపించారు.

గతంలో కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పకు 17 ఏ రక్షణ ఉంటుందని ఇదే సిఐడి న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదించి గెలిచారు. కానీ ఇక్కడ దానికి భిన్నంగా వాదించి తనకు అనుకూలంగా తీర్పు వచ్చేలా చూశారు. అసలు ఓ నోటీస్ ఇవ్వలేదు, కనీసం ఎఫ్ఐఆర్ లో పేరు లేదు. అప్పటికప్పుడు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఆధారాలు చూపించకుండానే జైల్లో పెట్టగలిగారు. అటు ఏసీబీ కోర్టు, ఇటు హైకోర్టులో సైతం చంద్రబాబుకు ఊరట తగ్గకపోవడం విశేషం.

అయితే ఈసారి హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారా? లేకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా అన్నది చూడాల్సి ఉంది. ఆది నుంచి ఈ కేసు విషయంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేయకుండా.. క్వాష్ పిటీషన్ వేసింది. అయితే అటు సిఐడి చీఫ్ సంజయ్ రెడ్డి, ఏ ఏ జి పొన్నవులు సుధాకర్ రెడ్డి పట్టు బిగిస్తూ వస్తున్నారు. ఒక వ్యూహం ప్రకారం వ్యవహరిస్తూ వచ్చారు. దీంతో చంద్రబాబుకు రిమాండ్ తప్పడం లేదు. ఇప్పుడు హైకోర్టులో చుక్కెదురు కావడంతో తెలుగుదేశం పార్టీ నాయకత్వం తరువాత వ్యూహంఎలా ఉంటుందో చూడాలి మరి.