https://oktelugu.com/

Mahindra Thar Roxx : గంటలో 1.76 లక్షలు బుకింగ్.. లో బడ్జెట్ లోనే SUV.. ఈ కారు గురించి తెలుసా?

థార్ రాక్స్ మార్కెట్లోకి రాకముందే సంచలనం సృష్టించింది. ఎవరూ ఊహించిన విధంగా థార్ రాక్స్ సేల్స్ ఉండడంతో దీని గురించి తీవ్రంగా చర్చ సాగుతోంది. ఇంతకీ థార్ రాక్స్ ఇప్పటికే ఎన్ని బుకింగ్ అయ్యాయి? దీని ఫీచర్లు ఏంటి? ఆ వివరాల్లోకి వెళితే.

Written By:
  • Srinivas
  • , Updated On : October 5, 2024 / 04:59 PM IST

    Mahindra Thar Roxx

    Follow us on

    Mahindra Thar Roxx :  దేశంలో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. దీని నుంచి వెలువడే కార్లకు మరింత క్రేజ్ ఉంటుంది. మహీంద్రా నుంచి రిలీజ్ అయిన ‘థార్’ మోడల్ సాధారణం కంటే ఎక్కవ అమ్మకాలు నమోదు చేసుకొంది. దీంతో ఈ బ్రాండ్ పై వివిధ వేరియంట్లు మార్కెట్లోకి రిలీజ్ అయ్యాయి. తాజాగా థార్ రాక్స్ వెర్షన్ బుకింగ్స్ ప్రారంభించారు. దసరా సందర్భంగా థార్ రాక్స్ ను మార్కెట్లో లాంచ్ చేయనున్నారు. అయితే థార్ రాక్స్ మార్కెట్లోకి రాకముందే సంచలనం సృష్టించింది. ఎవరూ ఊహించిన విధంగా థార్ రాక్స్ సేల్స్ ఉండడంతో దీని గురించి తీవ్రంగా చర్చ సాగుతోంది. ఇంతకీ థార్ రాక్స్ ఇప్పటికే ఎన్ని బుకింగ్ అయ్యాయి? దీని ఫీచర్లు ఏంటి? ఆ వివరాల్లోకి వెళితే..

    ప్రస్తుతం కాలంలో కొత్త కారు కొనాలని అనుకునేవారు SUVలపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఎస్ యూవీలను తీసుకురావడంలో మహీంద్రాను మించిన వార లేరనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మహీంద్రా నుంచి మార్కెట్లోకి వచ్చిన ఎస్ యూవీలు దాదాపు అన్నీ సక్సెస్ అయ్యాయి. వీటిలో థార్ ఎవర్ గ్రీన్ అని చెప్పుకోవాలి. 2018లో దీనిని మార్కెట్లోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు థార్ కు క్రేజ్ తగ్గలేదు. అంతేకాకుండా దీనికి పోటీగా మారుతి జిమ్ని తీసుకొచ్చినా థార్ కు ఉన్న ఆదరణ తగ్గలేదు.

    తెలుగు రాష్ట్రాల్లో పండుగల సీజన్ సమయంలో కొత్త వాహనాలు మార్కెట్లోకి తీసుకురావడం ఆనవాయితీ. ఇప్పటికే కొన్ని కంపెనీలు కొత్త వెహికల్స్ ను పరిచయం చేశాయి. అయితే దసరా రోజు అంటే అక్టోబర్ 12న మహీంద్రా కంపెనీ థార్ రాక్స్ ను లాంచ్ చేయనుంది. దీనికి సంబంధించిన బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభించారు. ఈ బుకింగ్ ప్రారంభించిన గంటలోనే 1.76 లక్షలు మంది ఎన్ రోల్ చేసుకున్నారు. దసరా రోజు ఈ వెహికల్ తీసుకోవాలని చాలా మంది ఉత్సాహం చూపుతున్నారు.

    థార్ రాక్స్ ను రూ.12.99 లక్షల ప్రారంభ ధరతో విక్రయించనున్నారు. ఆయా ప్రాంతాలను బట్టి ధర మారే అవకాశం ఉంది. అంతేకాకుండా థార్ రాక్స్ ఫీచర్ష్ ను ఇప్పటికే పరిచయం చేశారు. దీంతో దీనిపై చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. థార్ రాక్స్ 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. దీని ప్రకారం 162 బీహెచ్ పీ పవర్, 330 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో డీజిల్ ఇంజిన్ ఆప్షన్ కూడా ఉంది. థార్ రాక్స్ లో క్రాల్ స్మార్ట్ ఆసిస్ట్, ఎలక్ట్రానిక్ లాకింగ్ రియర్ డిఫరెన్షియల్, 3 పాయింట్ సీట్ బెల్ట్ , డిస్క్ బ్రేకులు ఉన్నాయి. సేప్టీ కోసం 6 ఎయిర్ బ్యాగ్స్, రియర్ కెమెరా, 2 అడాస్ లెవల్ సూట్ తో అందిస్తున్నారు. అయితే పూర్తి ఫీచర్లు తెలియాలంటే మాత్రం ఈ మోడల్ మార్కెట్లోకి వచ్చిన తరువాతే అర్థం కానుంది అని అంటున్నారు. కానీ ఓల్డ్ థార్ ను బేస్ చేసుకొని చాల మంది థార్ రాక్స్ కోసం ఎగబడుతున్నారు.